Wedding Video: హల్దీ వేడుకలో హల్చల్, పెళ్లి కుమార్తెను స్విమ్మింగ్ ఫూల్‌లో విసిరేసిన వైనం, వీడియో వైరల్
Wedding Video: సోషల్ మీడియాలో ఇప్పుడొక వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. అందరూ చూస్తుండగా..పట్టపగలే పెళ్లికూతురిని స్విమ్మింగ్ ఫూల్‌లో విసిరేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్ వైరల్ అవుతోంది.
Wedding Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడొక వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. అందరూ చూస్తుండగా..పట్టపగలే పెళ్లికూతురిని స్విమ్మింగ్ ఫూల్‌లో విసిరేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్ వైరల్ అవుతోంది.
పెళ్లికూతురు అందంగా ముస్తాబైంది. పసుపు వేడుక అది. ఉన్నట్టుంది నలుగురొచ్చారు. ఏ మాత్రం మొహమాటం లేకుండా నిర్దాక్షిణ్యంగా పెళ్లి కూతురు కాళ్లు..చేతులు పట్టుకుని అందరూ చూస్తుండగానే పక్కనే ఉన్న స్విమ్మింగ్ ఫూల్‌లో విసిరేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..
సాధారణంగా పెళ్లిళ్లకు సంబంధించి ఫన్నీ వీడియోలు నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. సరదా, ఫ్రాంక్, ఆటపట్టించే విజ్యువల్స్ ఇలా అన్నీ వైరల్ అవుతుంటాయి. అటువంటిదే ఇది కూడా. ఇక్కడొక పెళ్లికూతురికి పసుపు రాసే వేడుక జరుగుతుంటుంది. ఈ వేడుకలో పెళ్లికూతురు స్నేహితులు కొంతమంది...కాళ్లు చేతులు పట్టుకుని ఆమెను స్విమ్మింగ్ ఫూల్‌లో విసిరేస్తారు. అటు ఆ ఫూల్‌లో అప్పటికే ఆ పెళ్లికూతురు సోదరి రక్షణకోసం సిద్ధంగా ఉంటుంది.
ఆ పెళ్లికూతురి పేరు కృతికా ఖురానా. ఈమె ఓ యూట్యూబర్ కూడా. దాంతోపాటు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది. తన స్నేహితులు తనని స్విమ్మింగ్ ఫూల్‌లో విసిరేసే వీడియోను స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ముందు కాళ్లు చేతులు పట్టుకుని అటూ ఇటూ ఊపుతారు. ఒక్కసారిగా నీళ్లలో విసిరేస్తారు. ఆ స్విమ్మింగ్ ఫూల్‌లో అప్పటికే ఉన్న ఆమె చెల్లెలు ఆమెను పట్టుకుంటుంది. ఈ ఫన్నీ వీడియా కావాలనే షూట్ చేసిన షేర్ చేశారు. ఇదిప్పుడు వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు నచ్చిన రీతిలో కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి వరకూ 26 లక్షలమంది ఈ వీడియో వీక్షించారు. 2 లక్షల కంటే ఎక్కువ లైక్స్ వచ్చి పడ్డాయి. పెళ్లి కుమార్తె, ఆమె స్నేహితుల కంటే స్విమ్మింగ్ ఫూల్‌లో ఉన్న పెళ్లి కూతురు చెల్లెల్ని ఎక్కువగా ప్రశంసిస్తున్నారు. పెళ్లి కుమార్తె రక్షణ కోసం ముందు నుంచే స్విమ్మింగ్ ఫూల్‌లో సిద్ధంగా ఉన్నందుకు కీర్తిస్తున్నారు.
Also read: Shocking Viral Video: ఈ సీ లయన్ వేషాలు చూస్తే నవ్వకుండా ఉండలేరు, వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook