Weird Ritual in Chhattisgarh: మన దేశంలోని రాష్ట్రాలలో వివిధ భాషలు, అనేక సంస్కృతులు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలలో ఆచరించే ఆచారాలు వేరువేరుగా ఉండటం సర్వసాధారణం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ కొన్ని ఆచారాలు కొంత మందికి వింతగా అనిపిస్తుంటాయి కానీ పాటించక తప్పదు.. ఈ రోజు మేము మీకు చెప్పపోయే ఆచారం మన దేశంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని  మహాస్‌మండ్ జిల్లా జోగినగర్ గ్రామంలో ఆచరిస్తున్నారు. 


Also Read: Samantha Emotional Post: అబార్షన్, అఫైర్లపై స్పందించిన సమంత..ఎప్పటికలా చేయనంటూ పోస్ట్


సాధారణంగా పెళ్లిలో వరుడికి కారు, బైక్, లేదా పొలం, బిల్డింగ్ వంటివి వధువు తండ్రి పెళ్లి కొడుకుకి కానుకగా ఇస్తుంటారు, కానీ ఈ మహాస్‌మండ్ జిల్లా జోగినగర్ గ్రామంలో వరుడికి పెళ్లి మండపంలో విషపూరిత పాములను బహుకరించాల్సి ఉంటుంది. అవునండి మీరు విన్నది నిజమే!ఈ గ్రామంలో వింత ఆచారం కొనసాగుతుంది.. పెళ్లి చేసుకునే వరుడికి వివాహం జరిగే రోజున 21 విషపూరిత పాములను కానుకగా సమర్పించాలి. పెళ్లి కూతురు


తండ్రి మాత్రమే వరుడికి ఈ పాములను బహుకరించాల్సి ఉంటుంది. ఈ రకమైన సంప్రదాయం కేవలం పెళ్లి సమయంలో మాత్రమే అక్కడి ప్రజలు పాటిస్తారట.


Also Read: Update on MAA Election Results: రేపే 'మా' ఎన్నికలు.. రేపే ఫలితాల వెల్లడి


ఒకవేళ పెళ్లి కూతురు తండ్రి దగ్గర 21 విషపూరిత పాములు లేనట్లయితే ఇరుగుపొరుగు లేదా బంధువుల దగ్గరి నుండి అప్పుగా తీసుకోవాల్సి ఉంటుంది. వివాహాం తరువాత అప్పుగా తెచ్చుకున్న పాములను తిరిగి వారికి అప్పగించాల్సి ఉంటుంది. ఇవే కాదండోయ్ ఇలాంటి వింత ఆచారాలు ప్రపంచ వ్యాప్తంగా చెలానే ఉన్నాయి. 


ఇది మాత్రమే కాదు.. ఒకవేళ గ్రామంలో ఏదైనా కారణం చేత పాము చనిపోతే.. ఊరందరిని పిలిచి, భోజనాలు పెట్టించి ఒక పెద్ద కార్యక్రమంలాగా జరిపించటం అక్కడి సాంప్రదాయం. అంతేకాదు ఒకవేళ పాములు కలిగి ఉన్న యజమాని ఏదైనా పాము చనిపోతే మీసాలు, గడ్డం తీసేయాల్సి వస్తుంది. 


Also Read: Special Train Tickets Hike: రైల్వేశాఖ స్పెషల్ బాదుడు..ఒక్కో ప్రయాణికుడిపై రూ.200-రూ.700 వసూలు


ఇలాంటి సంప్రదాయాలను వారు ఇప్పటికీ ఆచరిస్తూనే ఉన్నారు. పాములు ఎంత విషపూరితమో తెలిసినప్పటికీ ఇంట్లోనే పెంచటం వారి పురాతనకాలం నుండి వస్తున్న ఆచారం. ప్రస్తుతం ఈ పాములు అంతరిస్తున్న కారణంగా ఇంట్లో పాములు పెంచటం నిషిధించింది అక్కడి అటవీ శాఖ.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook