Viral Dance: టికెట్ వస్తే ఇంత ఆనందమా? `జింబా`రే `జింబా`రారే ఎమ్మెల్యే డ్యాన్స్ వైరల్
Darjeeling MLA Neeraj Zimba Viral Dance Video: రాజకీయం అంటేనే పదవులు, డబ్బు. పదవులు లేకుంటే రాజకీయ నాయకులు బతకలేరు. ఇలా ఒక నాయకుడు తన స్నేహితుడికి పదవికి దక్కడంతో సంబరంగా డ్యాన్స్‌లు చేశాడు.
Neeraj Zimba: రాజకీయాలు అంటే ఎన్నికల రాజకీయమే. పదవుల కోసం రాజకీయాలు చేసేది. మరి అలాంటిది ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ వస్తే మామూలు ఆనందం ఉండదు. తన స్నేహితుడికి టికెట్ వచ్చిన ఆనందంలో ఓ ఎమ్మెల్యే ఆనంద తాండవం చేశాడు. పార్టీ టికెట్ ప్రకటించిన ఆనందంలో ఎమ్మెల్యే డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇంట్లో డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
Also Read: Legal Notice: మీడియా సంస్థలకు కేటీఆర్ భారీ షాక్.. బామ్మర్దితో ఛానల్స్‌కు రూ.160 కోట్ల నోటీసులు
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఆదివారం 111 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. వాటిలో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గానికి రాజు బిస్టాకు బీజేపీ టికెట్ కేటాయించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా తెగ సంబరపడిపోయాడు. తన స్నేహితుడైన రాజు బిస్టాకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో పరమానందపడ్డాడు. టికెట్ ప్రకటించిన ఆనందంలో ఇంట్లోనే స్టెప్పులు వేశాడు. టీవీలో టికెట్ ప్రకటన చూసి వెంటనే డ్యాన్స్‌లు చేశాడు. అదిరిపోయే పాటకు తగ్గట్టు ఎమ్మెల్యే నీరజ్ జింబా ఆడడం వైరల్‌గా మారింది.
Also Read: KT Rama Rao: యూట్యూబ్ ఛానళ్లపై కేటీఆర్ యుద్ధం.. ఇక ఆయా ఛానళ్ల వారికి చుక్కలే
నీరజ్ జింబా ఎవరు?
గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శిగా నీరజ్ జింబా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా డార్జిలింగ్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నీరజ్ జింబాకు రాజు బిస్టా అత్యంత స్నేహితుడు. వీరిద్దరూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పార్టీ టికెట్ కోసం రాజు బిస్టా, నీరజ్ జింబా ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డార్జిలింగ్ నుంచి ఎమ్మెల్యేగా నీరజ్ జింబా ఎన్నికవగా.. రాజు బిస్టాకు అవకాశం దక్కలేదు. లోక్‌సభ ఎన్నికల్లో రాజుకు టికెట్ ఇవ్వాలని బీజేపీకి నీరజ్ జింబా ఆల్టిమేటం పెట్టారు. అతడికి టికెట్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. చివరకు డార్జిలింగ్ లోక్‌సభ సీటు అభ్యర్థిగా రాజు బిస్టాకు ప్రకటించడంతో నీరజ్ జింబా సంబరంతో డ్యాన్స్‌లు చేశాడు. ఇక తన స్నేహితుడు రాజును ఎంపీగా గెలిపించుకునేందుకు నీరజ్ కృషి చేస్తానని ప్రకటించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి