Whatsapp accounts banned: అక్టోబర్‌లో ఇండియాలో 20 లక్షలకుపైగా వాట్సాప్ అకౌంట్స్‌పై బ్యాన్
Whatsapp accounts banned in India: అక్టోబర్‌లో ఇండియాలో 20 లక్షలకుపైగా వాట్సాప్ అకౌంట్స్‌పై వాట్సాప్ నిషేధం విధించింది. అంటే ఆయా వాట్సాప్ అకౌంట్స్‌ని వాట్సాప్ సంస్థే స్వయంగా బ్యాన్ చేసిందన్న మాట. అంతేకాకుండా ఇదే అక్టోబర్ నెలలో వాట్సాప్‌కి 500 కి పైగా ఫిర్యాదులు అందాయట.
Whatsapp accounts banned in India: అక్టోబర్‌లో ఇండియాలో 20 లక్షలకుపైగా వాట్సాప్ అకౌంట్స్‌పై వాట్సాప్ నిషేధం విధించింది. అంటే ఆయా వాట్సాప్ అకౌంట్స్‌ని వాట్సాప్ సంస్థే స్వయంగా బ్యాన్ చేసిందన్న మాట. అంతేకాకుండా ఇదే అక్టోబర్ నెలలో వాట్సాప్‌కి 500 కి పైగా ఫిర్యాదులు అందాయట. ఈ విషయాన్ని స్వయంగా వాట్సాప్ వెల్లడించింది. తమ సంస్థ తాజా కంప్లయన్స్ రిపోర్టులో వాట్సాప్ (Whatsapp october monthly report) ఈ వివరాలు పేర్కొంది.
ఒక్క అక్టోబర్ నెలలోనే సరిగ్గా 20 లక్షల 69 వేల వాట్సాప్ ఎకౌంట్స్ బ్యాన్ అయ్యాయని వాట్సాప్ తెలిపింది. +91 అనే నెంబర్‌తో మొదలయ్యే నెంబర్స్ ఆధారంగా వాటిని ఇండియన్ వాట్సాప్ అకౌంట్స్‌గా గుర్తించినట్టు వాట్సాప్ స్పష్టంచేసింది. ఇదే విషయమై వాట్సాప్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. వాట్సాప్ యూజర్స్ ప్రైవసీ, సేఫ్టీ (Whatsapp users privacy) కోసం వాట్సాప్ సంస్థ నిరంతరంగా కృషి చేస్తూనే ఉందని, అందులో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని తెలిపారు. ఐటి రూల్స్ 2021 ప్రకారం తాజాగా వాట్సాప్ ఇటీవలే అక్టోబర్ నెల నివేదికలు బహిర్గతం చేసినట్టు సదరు అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
Also read : Newly weds couple falls from JCB, Viral Video : జేసీబీ నుంచి కింద పడిన నూతన జంట.. వీడియో వైరల్
వాట్సాప్‌పై వేధింపులను నివారించడం కోసం ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నెలకు సగటున 8 మిలియన్ల మంది యూజర్ల అకౌంట్స్‌పై నిషేధం (Ban on whatsapp accounts) విధిస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook