Newlyweds fall from JCB, Viral Video : కొత్తగా ట్రై చేసిన నవజంట.. జేసీబీ నుంచి కింద పడి షాక్ ఇచ్చారు!

Newlyweds fall on table from JCB : జేసీబీ బకెట్‌లో కూర్చొని ఆ నవజంట పెళ్లికి వ‌చ్చిన వారందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంది. అలా కూర్చొన్న పెళ్లికొడుకు, పెళ్లి కూతురిని చూసి అందరూ సంబరపడిపోయారు. సరదాసరదాగా సాగుతోన్న ఆ ఫంక్షన్‌ లో ఉన్నవారందరూ ఒక్కసారి షాక్ కు గురయ్యే ఇన్సిడెంట్ జరిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2021, 10:21 PM IST
  • కొత్త ట్రెండ్‌లతో పెళ్లిళ్లు
  • కొత్తగా ట్రై చేసి అందరి ముందు అబాసుపాలవుతున్న జంటలు
  • జేసీబీ బకెట్‌లో కూర్చొని పెళ్లికి వ‌చ్చిన వారందరినీ రిసీవ్ చేసుకున్న నవజంట
Newlyweds fall from JCB, Viral Video : కొత్తగా ట్రై చేసిన నవజంట.. జేసీబీ నుంచి కింద పడి షాక్ ఇచ్చారు!

Newlyweds fall on table from JCB on wedding day Video goes viral : ప్రస్తుతం పెళ్లిళ్లను వైరైటీ.. వైరైటీగా చేసుకోవడం కామన్ అయిపోయింది. ఎంత కొత్తగా చేస్తే అదే ట్రెండ్. అంద‌రూ షాక్ అయ్యేలా పెళ్లి చేసుకోవాలని ఇప్పుడున్న జంటలు భలే ముచ్చటపడుతున్నాయి. ఇంక కొన్ని జంటలేమో కొత్త ట్రెండ్‌లతో సోషల్ మీడియాలో (Social media) వైరలయ్యే రేంజ్‌లో తమ పెళ్లిళ్లను చేసుకుంటున్నాయి. 

మరికొన్ని జంటలేమో తమ పెళ్లిళ్లలో జరిగిన చిన్నపాటి పొరపాట్ల వల్ల సోషల్ మీడియాకు ఎక్కుతున్నాయి. కొత్తగా ట్రై చేసి అందరి ముందు అబాసుపాలయ్యే జంటలు కూడా ఉన్నాయి. పెళ్లికి వచ్చిన వారి ముందు పాపం తమ పరువు మొత్తం పోగొట్టుకుంటున్నారు నవవధూవరులు (Newlyweds). 

పెళ్లిళ్లలో పెళ్లి కూతుర్ల డ్యాన్స్‌లు, (Dances) పెళ్లి వేదికపైకి పెళ్లి కూతుర్లు వచ్చే విధానాలు.. ఇలా ఎన్నో వీడియోలను మనం సోషల్‌ మీడియాలో చూసి ఉంటాం. అయితే ఒక జంట కాస్త వైరైటీగా (Variety) ట్రై చేద్దామని.. ఏకంగా జేసీబీపై కూర్చొని పోజ్ ఇచ్చింది. 

 

Also Read : NTR, Mahesh Babu, Chiranjeevi donates: వరద బాధితులకు ఎన్టీఆర్, మహేష్, చిరు విరాళాలు

జేసీబీ బకెట్‌లో కూర్చొన్న ఆ నవజంట.. తమ పెళ్లికి వ‌చ్చిన వారందరికి అక్కడి నుంచే హాయ్ చెబుతూ రిసీవ్ చేసుకుంటూ ఉంది. ఇక జేసీబీ (JCB) ముందు ఉండే బకెట్‌ అందంగా ముస్తాబు చేయగా.. అందులో దర్జాగా కూర్చొన్న పెళ్లికొడుకు, పెళ్లి కూతురిని చూసి అందరూ సంబరపడిపోయారు. అలా సరదాసరదాగా సాగుతోన్న ఆ ఫంక్షన్‌ లో ఉన్నవారందరూ ఒక్కసారి షాక్ కు గురయ్యే ఇన్సిడెంట్ జరిగింది.  పెళ్లికి వ‌స్తోన్న అతిథులకు ఆ నవవధూవరులు.. వెల్‌క‌మ్ చెప్తుండగా.. ఇంత‌లోనే జేసీబీ డ్రైవ‌ర్ దాన్ని కాస్త మూవ్ చేశారు. అంతే ఒక్కసారిగా జేసీబీ బకెట్ నుంచి పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు కింద ఉన్న టేబుల్‌పై (Table‌) పడిపోయారు. ఇక ఆ టేబుల్ కూడా డ్యామేజ్ కావడంతో ఇద్ద‌రూ కిందపడిపోయారు. ఇందుకు సంబంధించి  వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Also Read : Amazing Video: ఎపుడైనా పాము తన పిల్లలకి జన్మనివ్వటం చూసారా..? ఎక్స్‌క్లూజివ్‌ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News