Whatsapp New Feature: వాట్సప్‌లో మరో సరికొత్త ఫీచర్, త్వరలో కవర్ ఫోటో సౌకర్యం
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుుడు అప్‌డేట్స్ అందిస్తోంది. యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. కొత్తగా మరో ఫీచర్ అందుబాటులో తీసుకొస్తోంది.
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుుడు అప్‌డేట్స్ అందిస్తోంది. యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. కొత్తగా మరో ఫీచర్ అందుబాటులో తీసుకొస్తోంది.
సోషల్ మీడియా వేదికంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది ఫేస్‌బుక్, వాట్సప్ మాత్రమే. ఇందులో వాట్సప్‌కు ప్రముఖ మెస్సేజింగ్ యాప్‌గా పేరుంది. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందిస్తుంటోంది. ఇప్పుడు మరో ఫీచర్ అందించేందుకు సిద్ధమౌతోంది. ఆ కొత్త ఫీచర్ ఏంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
ఫేస్‌బుక్‌లో కవర్ ఫోటో పెట్టుకునే సౌకర్యముంటుంది. కానీ వాట్సప్‌కు ఆ పరిస్థితి లేదు. అందుకే వినియోగదారుల వాట్సప్ ప్రొఫైల్ కోసం కవర్ ఫోటోల్ని సెట్ చేసుకునే అనుమతించే కొత్త ఫీచర్‌పై వాట్సప్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రయత్నాలు విజయవంతమైతే..ఇక నుంచి ప్రొఫైల్ ఫోటోల్ని కూడా పెట్టుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో మాదిరిగానే కవర్ ఫోటో పెట్టుకోవచ్చు. అయితే ఈ కొత్త ఫీచర్ వాట్సప్ బిజినెస్ వినియోగదారులకు మాత్రమే పరిమితం కానుంది. వాట్సప్ (Whatsapp)బీటో ఇన్ఫో నివేదిక ప్రకారం..వాట్సప్ కేటలాగ్ నిర్వహించేందుకు కొత్త ఫీచర్ పనిచేయనుంది. బిజినెస్ కార్యకలాపాల కోసం కవర్ ఫోటో సెట్ చేసే సామర్ధ్యం, భవిష్యత్‌లో అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. బిజినెస్ సెట్టింగుల కింద వినియోగదారులు అదనపు కెమేరా బటన్ ఆప్షన్ ఉంటుంది. ఈ బటన్ ఆధారంగా ప్రొఫైల్ కవర్ ఫోటోల్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పటికే మొబైల్ వెర్షన్‌కు పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్లను డెస్క్‌టాప్ యూజర్లకు సైతం అందుబాటులో తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులో తీసుకొస్తూ..వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది వాట్సప్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook