WhatsApp Is Ready To Launch New Log Out Feature: వాట్సాప్ ప్రైవసీ పాలసీ వివాదం ఆ సంస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో కొత్త పాలసీని మే నెల వరకు వాయిదా వేసుకున్న వాట్సాప్ వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకునే యత్నాలు ముమ్మరం చేసింది. అయితే వాట్సాప్ అకౌంట్లు డిలీట్, వాట్సాప్ అన్‌ఇన్‌స్టాల్స్ మిలియన్లలో జరిగాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు వాట్సాప్(WhatsApp) వెబ్ లాగిన్ సహా సరికొత్త ఫీచర్లును తీసుకొచ్చింది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. వాట్సాప్ లాగౌట్ కోసం సరికొత్త ఫీచర్ తేనుంది. దాంతో పాటు మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌ను   ఆండ్రాయిడ్ యూజర్లకి‌ బీటా వెర్షన్ అందుబాటులోకి తెచ్చింది. 


Also Read: Google Play Store: వాట్సాప్, ఫేస్‌బుక్‌లను వెనక్కి నెట్టిన Telegram యాప్, Non-Gaming Appలలో రికార్డులు


ఆండ్రాయిడ్(Android News),‌ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఈ రెండు ఫీచర్లు లాంచ్ కానున్నాయి. ఒక డివైస్‌లో లాగౌట్ చేసి మరో డివైజ్‌లో వాట్సాప్(WhatsApp Features)‌ను యాక్సెస్ చేసుకునే ఫీచర్ త్వరలో లాంచ్ అవుతుంది. అదే సమయంలో సిగ్నల్, టెలిగ్రామ్ యాప్స్ ఇన్‌స్టాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు వాట్సాప్ మరో షాక్ ఇచ్చేందుకు సైతం సిద్ధమైంది. 


Also Read: Web WhatsApp Login: త్వరలో సరికొత్త WhatsApp Privacy ఫీచర్, 2 విధాలుగా వెబ్ లాగిన్


వాట్సాప్ తాజా బీటా వర్షన్‌లో డిలీట్ వాట్సాప్(Delete WhatsApp) ఆప్షన్ కనిపించడం లేదు. దీంతో మెయిన్ వర్షన్‌లో సైతం వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసుకునే సదుపాయం లేకుండా మార్పులు చేయనున్నట్లు అర్థమవుతోంది.


Also Read: WhatsApp Privacy Policy: ప్రైవసీ పాలసీపై వివాదంలోనూ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చిన WhatsApp 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook