Google Play Store: వాట్సాప్, ఫేస్‌బుక్‌లను వెనక్కి నెట్టిన Telegram యాప్, Non-Gaming Appలలో రికార్డులు

Telegram Most Downloaded App Worldwide In January : మొబైల్ యాప్‌లపై విశ్లేషణ చేసి నివేదిక అందించే సెన్సార్ టవర్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. 24 శాతం డౌన్‌లోడ్స్‌తో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 7, 2021, 05:06 PM IST
  • వాట్సాప్ ప్రైవసీ పాలసీ విధానం సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి ఎన్నో యాప్‌లకు లాభాలు
  • గూగుల్ ప్లే స్టోర్‌లో జనవరిలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్ టెలిగ్రామ్
  • రెండు, మూడు స్థానాల్లో చోటు దక్కించుకోలేని వాట్సాప్, ఫేస్‌బుక్ యాప్స్
Google Play Store: వాట్సాప్, ఫేస్‌బుక్‌లను వెనక్కి నెట్టిన Telegram యాప్, Non-Gaming Appలలో రికార్డులు

Telegram Most Downloaded App Worldwide In Google Play Store: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ పాలసీ విధానం సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి ఎన్నో యాప్‌లకు లాభాన్ని అందిస్తోంది. తాజాగా టెలిగ్రామ్ యాప్ సరికొత్త రికార్డు సృష్టించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో జనవరి నెలలో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్‌గా టెలిగ్రామ్ నిలిచింది. 

గత నెల జనవరిలో ప్లే స్టోర్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న టెలిగ్రామ్ యాప్ ప్రస్తుతం ఏకంగా తొలి స్థానానికి చేరుకోవడం గమనార్హం. అయితే భారతదేశంలోనే టెలిగ్రామ్ యాప్(Telegram App)‌ను అత్యధికంగా వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 63 మిలియన్ల కన్నా ఎక్కువ డౌన్‌లోడ్లతో సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది.

Also Read: Airtel 5G Services test: 5జీ టెస్ట్ సర్వీసును ప్రారంభించిన ఎయిర్‌టెల్, మీరు కూడా పొందవచ్చు ఇలా..

 

మొబైల్ యాప్‌లపై విశ్లేషణ చేసి నివేదిక అందించే సెన్సార్ టవర్ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. 24 శాతం డౌన్‌లోడ్స్‌తో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో ఇండోనేషియా ఉంది. నాన్ గేమింగ్ యాప్స్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్‌గా వాట్సాప్(WhatsApp) లాంటి యాప్‌లను వెనక్కి నెట్టిన టెలిగ్రామ్ నిలిచింది. 

Also Read: WhatsApp Chat: మీ వాట్సాప్ ఛాటింగ్ డేటాను Telegram Appకు ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి

 

ప్రైవసీ పాలసీ అమలులోకి రానుందని గత నెలలో వాట్సాప్ సంస్థ నోటిఫికేషన్ అందుకున్న వినియోగదారులు అంతే వేగంగా యాప్‌ను అన్‌ ఇన్‌స్టాల్ చేశారు. వాట్సాప్ అకౌంట్లను మిలియన్ల సంఖ్యలో డిలీట్ కూడా చేశారు. గత నెలలో టిక్‌టాక్(TikTok) యాప్ 62 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో నాన్ గేమింగ్ యాప్‌లలో రెండో స్థానంలో నిలిచింది.

Also Read: WhatsApp Privacy Policy: ప్రైవసీ పాలసీపై వివాదంలోనూ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చిన WhatsApp

 

ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి దిగ్గజ యాప్‌లను సైతం వెనక్కి నెట్టింది సిగ్నల్ యాప్. గత నెలలో డౌన్‌లోడ్ అయిన యాప్‌లలో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచిందని సెన్సార్ టవర్ సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి 8 నుంచి అమలకానుందని తొలుత ప్రకటించినా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడంతో మే నెలకు కొత్త ప్రైవసీ పాలసీ అమలును వాట్సాప్ సంస్త వాయిదా వేసింది.
 

Trending News