Whatsapp Latest Updates: వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. యూజర్ ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా సరికొత్త ఫీచర్స్‌ను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే త్వరలో ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుందనే కథనాలు వస్తున్నాయి. వాట్సాప్ గ్రూప్స్‌కు సంబంధించిన ఆ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా వాట్సాప్ యూజర్స్ ఏదైనా వాట్సాప్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయితే... ఆ విషయం గ్రూపులోని సభ్యులందరికీ తెలిసిపోతుంది. మీరు గ్రూప్‌ను వీడినట్లు మీ ఫోన్ నంబర్ లేదా పేరుతో స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది. గ్రూపులో ఎవరైనా కొత్త సభ్యులను యాడ్ చేసినా అందరికీ తెలిసిపోతుంది. అయితే రాబోయే రోజుల్లో ఈ ఫీచర్‌లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు WABetaInfo రిపోర్ట్ వెల్లడించింది.


ఆ రిపోర్ట్ ప్రకారం... వాట్సాప్ గ్రూప్‌ను ఎవరైనా వీడినట్లయితే... ఇకపై ఆ విషయం కేవలం గ్రూప్ అడ్మిన్‌కు మాత్రమే తెలుస్తుంది. గ్రూప్‌లోని మిగతా సభ్యులకు సదరు వ్యక్తి గ్రూప్‌ను వీడినట్లు తెలియదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై వాట్సాప్ టీమ్ వర్క్ చేస్తోంది. మొదట వాట్సాప్ డెస్క్‌ టాప్ బీటా వెర్షన్‌లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.  ఆ తర్వాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తారు.


Also Read: Somvati Amavasya 2022: సోమవతి అమావాస్య రోజు వివాహిత స్త్రీలు పొరపాటున కూడా ఇలా చేయొద్దు... చేస్తే భర్తకు కీడు..!   


Also Read: Net Banking Tips: పొరపాటున మరొకరి ఖాతాకు మనీ ట్రాన్స్‌ఫర్ చేశారా... ఇలా చేస్తే మీ డబ్బును తిరిగి పొందవచ్చు...   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook