Whatsapp Instant Loan: వాట్సాప్ బిజినెస్ అకౌంట్ యూజర్స్‌కు గుడ్ న్యూస్. ఇకపై ఈ మెసేజింగ్ యాప్ ద్వారా లోన్ సౌకర్యం కూడా పొందవచ్చు. అది కూడా కేవలం 30 సెకన్లలో. ఇందుకోసం కస్టమర్స్ ఎటువంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన పని లేదు. అత్యంత సులువుగా లోన్ పొందే ఈ సదుపాయంతో వాట్సాప్‌లో బిజినెస్ అకౌంట్ యూజర్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.ఇంతకీ ఈ లోన్ ఎలా పొందాలి.. గరిష్ఠంగా ఎంతవరకు లోన్ ఇస్తారు.. తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సులువైన ప్రక్రియ.. జస్ట్ ఒక్క మెసేజ్‌తో లోన్ :


వాట్సాప్ ద్వారా లోన్ పొందేందుకు మొదట మీరు చేయాల్సింది '+91 80975 53191' అనే వాట్సాప్ నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ చాట్ బాక్స్ ఓపెన్ చేసి.. ఆ నెంబర్‌కు 'HI'అనే మెసేజ్ పంపించాలి. అంతే లోన్ పొందేందుకు అవసరమైన ప్రొసీజర్‌ను మీరు పూర్తి చేసినట్లే. ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారంగా మీ కేవైసీ వివరాలు వెరిఫై చేయబడుతాయి. ఆ తదుపరి మీ ఖాతాలో డబ్బులు జమవుతాయి. ఇదంతా కేవలం 30 సెకన్లలో పూర్తవుతుంది.


ఎంతవరకు లోన్ ఇస్తారు :


వాట్సాప్ ఇచ్చే లోన్ మీ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే మీ ఆదాయాన్ని బట్టి ఇది నిర్ణయించబడుతుంది. మరో ముఖ్య విషయమేంటంటే.. కేవలం వేతనం పొందేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 24/7 ఈ లోన్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.


CAHeతో వాట్సాప్ టైఅప్:


క్యాష్ఈ అనే ముంబైకి చెందిన ఫైనాన్స్ సంస్థ ద్వారా వాట్సాప్ ఈ లోన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యాష్ఈ ద్వారానే వాట్సాప్ బిజినెస్ కస్టమర్లు క్రెడిట్ పొందుతారు. యాప్ డౌన్‌లోడ్ అవసరం లేకుండా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేకుండా ఈ తరహా క్రెడిట్‌ను ఆఫర్ చేస్తున్న తొలి సంస్థ తమదేనని క్యాష్ఈ వెల్లడించింది. 
 



Also Read: President Election 2022: రాష్ట్రపతి రేసులో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు.. పవార్ విముఖతతో తెరపైకి మరో ఇద్దరి పేర్లు..  


Also Read: Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్... మళ్లీ తగ్గిన బంగారం ధర... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook