WhatsApp Tips And Tricks: వాట్సాప్‌కు భారత్‌లో కోట్ల వినియోగదారులున్నారు. ఈ యాప్‌ను ఉపయోగించి చాటింగ్, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇండియాలో ఈ యాప్ వినియోగం చాలా పెరుగింది. వాట్సాప్‌లో చాలా రకాల ఫీచర్లు ఉంటాయి. కానీ చాలా మంది యూజర్స్‌కి ఈ యాప్‌కి సంబంధించిన చిట్కాలు, ట్రిక్స్ తెలియవు. ఇందులో కొత్త కొత్త ఫీచర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇప్పటికీ వినియోగదారు గుర్తించలేరు. అయితే ఇప్పుడు డిలీట్ చేసిన మెసేజ్‌లు, ఆడియోలు, వీడియోలను ఎలా చూడవచ్చో తెలుసుకుందాం..
ఈ ట్రిక్ చాలా సులభం (WhatsApp Tricks):
ఎవరైనా మీకు సందేశం పంపి కొన్ని సెకన్ల తర్వాత సెకన్లలో తొలగిస్తారు. అయితే చాలా మంది వారు సెండ్ చేసిన దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. కొందరైతే వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ తొలగించిన సందేశం ఏమిటో తెలుసుకోలేక పోతారు. అయితే కొన్ని ట్రిక్స్ ఉపయోగించి దీనిని సులభంగా తెలుసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి:
1. ఈ ట్రిక్‌ని ఉపయోగించడానికి.. థర్డ్ పార్టీ యాప్‌ని ఉపయోగించాలి.
2. ముందుగా WhatsAppdelete యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసిన తర్వాత దానిని ఓపెన్ చేసుకోవాలి.
3. ఆ తర్వాత కొన్ని రకాల ఫైల్స్‌ను అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
తొలగించబడిన సందేశం, ఆడియో, వీడియో ఇలా చేయచ్చు:
ఆ తర్వాత వాట్సాప్‌లో కొన్ని సెట్టింగ్‌లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ ఓపెన్ చేసి మూడు చుక్కలపై క్లిక్ చేయండి. సెట్టింగ్‌లకు వెళ్లి డేటా, స్టోరేజ్ యూసేజ్‌కి వెళ్లండి. అందులో మీడియా ఆటో డౌన్‌లోడ్‌కి వెళ్లి అన్ని ఆప్షన్స్‌కి అనుమతించాలి. ఇది అన్ని రకాల ఫైల్‌లను డౌన్‌లోడ్ చేస్తుంది. ఆ తర్వాత సులభంగా సందేశం, ఆడియో లేదా వీడియోని తిరిగి పొందగలుగుతారు.
ఆ తర్వాత ఎవరైనా సందేశం, ఆడియో, వీడియో క్లిప్ పంపి తొలగిస్తే.. ముందు డౌన్‌లోడ్ చేసిన WhatsAppdelete యాప్‌ను ఓపెన్ చేయాలి. యాప్ ఓపెన్ చేస్తే.. డిలీట్ చేసిన మెసేజ్, ఆడియో, వీడియో మీకు కనిపిస్తాయి.
Also Read: Exercises To Lower Cholesterol: గుండె జబ్బుల నుంచి ఇలా సులభంగా విముక్తి పొందండి..!
Also Read: IPL Media Rights: ఐపిఎల్ మీడియా రైట్స్ ఇ-వేలం.. బిసిసిఐని అభినందించిన జీ గ్రూప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook