Whatsapp Message Tricks: ఇటీవలీ కాలంలో ఏదైనా సర్టిఫికేట్ లేదా ఫొటోలు షేర్ చేసుకోవాలంటే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను నెటిజన్లు వినియోగిస్తున్నారు. వాట్సప్ యాప్ ప్రస్తుతం ప్రతి ఒక్కరీ మొబైల్ లో కచ్చితంగా ఉంటుంది. అయితే వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్‌ పంపాలంటే వారి నంబర్‌ మన కాంటాక్ట్ లిస్ట్‌లో కచ్చితంగా సేవ్‌ చేసుకోవాల్సిందే. ఒక్కోసారి జిరాక్స్‌ షాప్‌కు వెళ్లినప్పుడో.. లేదా వెరిఫికేషన్‌ కోసం ఏదైనా డాక్యుమెంట్ పంపాల్సిన సమయంలో అవతలి వ్యక్తికి వాట్సాప్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో నంబర్‌ సేవ్‌ చేయాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సమయంలో తప్ప వారి నంబర్‌ మనకు పెద్దగా అవసరం ఉండదు. అయినా సేవ్‌ చేసుకోవడం వల్ల మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండిపోతుంది. దీంతో అవసరంలేని నంబర్లతో మన కాంటాక్ట్ లిస్ట్ నిండిపోతుంది. దీంతో పనిగట్టుకుని అవసరంలేని నంబర్లను కాంటాక్ట్ జాబితా నుంచి డిలీట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ నంబర్‌ సేవ్‌ చేసుకోకుండా వాట్సాప్‌ నుంచి పంపగలితే? అదెలా సాధ్యమనేగా మీ సందేహం? అయితే ఈ చిన్న ట్రిక్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే.


  • అవతలి వ్యక్తి నంబరు సేవ్ చేసుకోకుండా.. వాట్సప్ మెసేజ్ పంపేందుకు మీ మొబైల్ లో ట్రూకాలర్ యాప్ కచ్చితంగా డౌన్ లోడ్ చేయాల్సిఉంది.

  • మీరు ఎవరికైతే వాట్సాప్‌ మెసేజ్‌ పంపాలనుకుంటున్నారో వారి నంబర్‌ను మీ ఫోన్‌లో డయల్‌ చేయాలి.

  • ఆ తర్వాత ట్రూకాలర్‌ యాప్‌లోకి వెళ్లి సదరు నంబర్‌పై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే వాట్సాప్ ఆప్షన్‌ కనిపిస్తుంది.

  • ఆ వాట్సప్ ఐకాన్ పై క్లిక్ చేస్తే ఆ నంబర్‌ వాట్సాప్ ఛాట్ పేజ్‌ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు వారికి మెసేజ్ చేయొచ్చు. అలా మీరు నంబర్‌ చేసుకోకుండానే ఇతరులకు వాట్సాప్‌ మెసేజ్‌ పంపొచ్చు.


Also Read: Who Is Parag Agrawal: ఈ పరాగ్ అగర్వాల్ ఎవరు?- టాప్-5 దిగ్గజ కంపెనీల్లో ఇండియన్స్ హవా?


Also Read: Nagini Dance: మైమరచిపోయి పాములు ఎలా డ్యాన్స్ చేస్తున్నాయో చూడండి! Viral Video


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook