Nagini Dance: మైమరచిపోయి పాములు ఎలా డ్యాన్స్ చేస్తున్నాయో చూడండి! Viral Video

మీరెప్పుడైనా నాగిని డ్యాన్స్ చూసారా..? మనుషులు చేసే డ్యాన్స్ కాదండోయ్ రెండు పాములు వర్షంలో మైమరచిపోయి ఎలా నృత్యము చేస్తున్నాయో మీరే చూడండి! ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 11:45 AM IST
  • ఈ మధ్య నెట్టింట్లో వైరల్ అవుతున్న పాముల వీడియోలు
  • వర్షంలో డ్యాన్స్ చేస్తున్న రెండు పాములు
  • నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్న పాముల డ్యాన్స్ వీడియో
Nagini Dance: మైమరచిపోయి పాములు ఎలా డ్యాన్స్ చేస్తున్నాయో చూడండి! Viral Video

Two Snakes Dancing in Rain: సోషల్ మీడియాలో (Social Media) రోజు డిఫెరెంట్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య ఎక్కువగా విషపూరితమైన పాముల వీడియోలు మరియు వాటి విన్యాసాలకు చెందిన వీడియోలు వైరల్ అవుతుండటం విశేషం.. అయితే ఈ రోజు రెండు పాముల డ్యాన్స్ వీడియో ఒకటి తెగ  వైరల్ అవుతుంది. 

అడవి జంతువులు వాటి వింత ప్రవర్తనల వీడియోలు ఎప్పటికపుడు చూస్తూనే ఉంటాము.. వీటితో పాటుగా.. చెప్పాలంటే.. జంతువుల కన్నా పాములు వీడియోలే ఎక్కువగా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 
వివరాల్లోకి వేళ్తే .. ఈ వీడియో తమిళనాడులోని (Tamil Nadu) తెన్‌కాశిలో (Tenkasi) తీయబడింది.. అడవిలో రెండు పాములు డ్యాన్స్ చేస్తున్న వీడియో చాలా మందిని ఆకర్షిస్తుంది. 

Also Read: Nellore Anandaiah: త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా-నెల్లూరు ఆనందయ్య సంచలన ప్రకటన

ఈ వీడియో జోహో సీఈఓ (Zoho CEO) శ్రీధర్ వెంబు (Sridhar Vembu) ట్విట్టర్‌లో పోస్ట్.. ఈ వీడియోలో రెండు పసుపు రంగు పాములు వర్షంలో డ్యాన్స్ చేస్తూ కనిపించాయి.. తమిళనాడులోని తెన్‌కాశిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో రెండు పాములు వర్షంలో డ్యాన్స్ చేయటం వీడియోలో చూడవచ్చు. 

ట్విట్టర్ లో వీడియో షేర్ చేసిన శ్రీధర్ వెంబు " ఈరోజు తెన్‌కాసిలో భారీ వర్షాలు కురిసిన సమయంలో పాములు చేసిన అద్భుతమైన డ్యాన్స్.. వాకింగ్‌ చేస్తున్న సమయంలో దీన్ని మీ ఫోన్ లో బందించినందుకు థాంక్స్ టూ @AksUnik" అని రాసాడు.. 

మొన్న ఒక వ్యక్తి గ్లాసులో వాటర్ పట్టుకొని ఉంటే.. బ్లాక్ కోబ్రా నీళ్లు (Black Cobra Driniking Video) తాగిన వీడియో తెగ వైరల్ అయిన సంగతి తేలింది.. అయితే ఇపుడు ఈ పాములు నాట్యం (Snake Dancing) చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింలో తెగ వైరల్అవుతుంది. 

Also Read: KS Bharat: వచ్చీరాగానే సూపర్ క్యాచ్ అందుకున్న కేఎస్ భరత్.. రహానేని ఒప్పించి మరీ (వీడియో)!

జూలై నెలలో..  కుటుంబాన్ని రక్షించడానికి పెంపుడు పిల్లి (Cat Fighting with Balck Cobra Video) దాదాపు 30 నిమిషాల పాటు కింగ్ కోబ్రాను నిలువరించిన వీడియో చూసాం కదా.. అది కూడా చాలా వైరల్ అయింది. భారతదేశం 350 కంటే ఎక్కువ రకాల పాములు ఉండొచ్చని నిపుణుల భావన.. వీటిలో చాలా వరకు పాములు విషపూరితం కానివి మరియు హానికరం కానివే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News