Mobile Phone Party: మిత్రుడి మొబైల్‌ ఫోన్‌ కొందామంటే మరో ఇద్దరు స్నేహితులు తోడుగా వెళ్లారు. ఫోన్‌ కొనుగోలు చేసిన అనంతరం తిరిగి ఇళ్లకు వస్తున్న సమయంలో 'పార్టీ' ఇవ్వాలని స్నేహితులు అడిగారు. 'పార్టీ లేదు.. ఏం లేదు. నేను ఇవ్వను' అని ఫోన్‌ కొన్న మిత్రుడు చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనయిన ఇద్దరు స్నేహితులు అతడిని దారుణంగా చంపేశారు. దావత్‌ ఇవ్వలేదని హత్య చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Shocking Incident: ఖతర్నాక్‌ మొగుడు పెళ్లాం.. బర్త్‌ డే పార్టీకి పిలిచి ఇంటి ఓనర్‌నే


 


ఢిల్లీలోని షకర్‌పుర్‌ ప్రాంతానికి చెందిన సచిన్‌ (16) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తనతోపాటు చదువుతున్న తన మిత్రులతో సరదాగా ఉంటారు. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడంతో ఫోన్‌ కొనడానికి సోమవారం తన ప్రియమైన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. దుకాణంలో ఫోన్‌ కొన్న ఆనందంలో ఇద్దరు మిత్రులు ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో మరో ముగ్గురు మిత్రులు తోడయ్యారు. మాట్లాడుకుంటున్న క్రమంలో 'ఫోన్‌ కొన్నందుకు పార్టీ ఇవ్వాలి' అంటూ స్నేహితులు అడిగారు.

Also Read: Viral Video: పిల్ల పామును పాప్‌కార్న్‌లా తినేసిన భారీ కట్ల పాము


పార్టీ ఇచ్చేందుకు సచిన్‌ నిరాకరించాడు. ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో పదునైన ఆయుధంతో సచిన్‌పై తోటి మిత్రులు దాడి చేశారు. వెనుక భాగంలో రెండు బలమైన గాయాలు కావడంతో సచిన్‌ కుప్పకూలిపోయాడు. భయాందోళనతో స్నేహితులు పరారయ్యారు. అయితే సాయంత్రం 7.30 సమయంలో పెట్రోలింగ్‌కు వచ్చిన షకర్‌పూర్‌ పోలీసులు సచిన్‌ను చూశారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.


అనంతరం సచిన్‌ను సమీపంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని తేలింది. పోస్టుమార్టం అనంతరం సచిన్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా హత్య చేసిన వారంతా సచిన్‌ క్లాస్‌మేట్స్‌ అని తెలిసింది. సీసీ కెమెరాల ద్వారా ఫుటేజ్‌ పరిశీలించగా సచిన్‌తో వారంతా ఉన్న విషయాన్ని గమనించి విచారించారు. తాము కొట్టడంతోనే చనిపోయారని పిల్లలు అంగీకరించంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారంతా 16 ఏళ్ల లోపు వారే కావడంతో జువైనల్‌ హోమ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.