Aurangabad: పెళ్లైన మహిళలకు భర్తే లోకం.. కని పెంచిన తల్లి దండ్రులను వదిలి భర్తే సర్వస్వమని అతడితో వెళ్తుంది. ఆడవారికి ఎంత సహానం ఉంటుందో అంతకు మించిన కోపం కూడా ఉంటుంది. మాములుగా భర్తలు ఎవైన అక్రమ సంబంధాలు (Illegal Affair) పెట్టుకున్నారని తెలిస్తే... ఆ కోపం కట్టలు తెంచుకొని... ఉగ్ర రూపం దాలుస్తుంది.. ఇపుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..?? వైరల్ అయిన ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్రలోని (Maharastra) ఔరంగాబాద్ లో జరిగిన ఒక సంఘటనకు చెందిన వీడియో నెట్టింట్లో వైరల్ (Viral Video) అయింది. కట్టుకున్న భర్త మరో యువతి హోటల్ ముందు పార్క్ చేసిన కారు దగ్గర వారిద్దరినీ చూడగానే ఆమె కోపం కట్టలు తెంచుకుంది. ఇంకేం ఉంది నడి రోడ్డు అని కూడా చూడకుండా.. భర్తతో ఉన్న మహిళపై విరుచుకు పడింది. 


Also Read: Gas Cylinder Price Increase: అక్టోబర్‌లో 60% పెరుగనున్న వంట గ్యాస్ ధరలు.. సామాన్యుల బ్రతుకే భారమాయే..!


ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఒక మహిళ హోటల్ ముందు పార్క్ చేసి ఉన్న కారు వైపు వేగంగా పరిగెత్తుతుంది.. ఎదో జరిగిందనే సమయంలోనే ముసుగుతో ఉన్న మహిళను భార్య కొడుతూ.. మధ్యలో భర్తను కూడా ఒక దెబ్బ వేసింది... కారులోంచి దిగిన ఆ మహిళ ముఖం పూర్తిగా బట్టతో కప్పిఉండటం.. భార్య ఆ మాస్క్ తొలగించటానికి చాలానే ప్రయత్నించింది. 'యే కౌన్ హై' (Who Is She) అంటూ అరవటం మనం వీడియోలో చూడవచ్చు. 



భర్తపై అనుమానం ఉన్న బహుశ కారును ఫాలో చేసి ఉంటుంది. అక్రమ సంబంధం ఉన్న మహిళతో సదురు వ్యక్తి హోటల్ కు రావటం.. హోటల్ కు వెళ్లాలని కారు దిగటం... వెనకాలే ఫాలో అవుతూ ఇదంతా చూసిన భార్య.. మొత్తానికి ఫన్నీగా ఉన్న... భార్యను చూసి చాలా మంది సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: SBI Customers Uninstall these 4 Apps: ఈ 4 యాప్స్ వాడితే మీ డబ్బులు గోవిందా.. గోవిందా..!!


ఈ వీడియో ను "గిడ్డె" అనే అకౌంట్ గల వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లో ఈ వీడియో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయింది. భార్యను చూసి కొంత మంది భాదపడగా.. అసలు ఆ యువతి ఎవరు ? ఎందుకు భర్తతో వెళ్లిందో అని భర్తను నిలదీయాలని మరి కొంత మంది సలహా ఇస్తున్నారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ అవ్వటం విశేషం. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి