70 Years Old Lady Dance: బుల్లెట్ బండి పాటపై 70 ఏళ్ల బామ్మ డ్యాన్స్ (Video)

సెన్సేషన్ క్రియేట్ చేసిన బుల్లెట్ బండి పాట గుర్తుందిగా.. అపుడు పెళ్లి కూతురు చేసిన వీడియో వైరలవ్వగా... ఇపుడు 70 ఏళ్ల బామ చేసిన డ్యాన్స్ తెగ వైరలవుతుంది.. మీరే చూడండి బామ్మ డ్యాన్స్ ఎలా ఇరగదీసిందో..!!  

Last Updated : Sep 15, 2021, 01:46 PM IST
  • మళ్లీ వైరలైన బుల్లెట్ బండి సాంగ్...
  • ఈ సారి 70 ఏళ్ల బామ్మ చేసిన వీడియో వైరల్
  • "నువ్వు గ్రేట్ బామ్మ" అంటూ నెటిజన్ల కామెంట్స్...
70 Years Old Lady Dance: బుల్లెట్ బండి పాటపై 70 ఏళ్ల బామ్మ డ్యాన్స్ (Video)

Old women dancing on Bullet buandi Song: తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ సాంగ్ (Bullet Song) తెలియని వారుండరు... ఇటీవలే ఒక పెళ్లి కూతురు బరాత్‌ లో పెళ్ళికొడుకు ముందు ఈ బుల్లెట్  బండి పాటపై  డ్యాన్స్ చేయటం... అది సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేయగానే వైరల్ అయింది. అలాగే ఆ జంటకు పాపులారిటీ పెరిగి సెలబ్రేటీలు కూడా అయ్యారు. 

సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో తెలీదు, ఎందుకు ట్రెండ్ అవుతుందో కూడా తెలియదు.. ఒక్కసారి ఏదైనా ట్రేండింగ్ లో వచ్చిందంటే... ఇంకా అంతే సంగతి.. కొంత కాలం పాటు వాటి హావ నెట్ లో నడుస్తూనే ఉంటుంది. 

Also Read: Covid 19 Treatment cost Rs 1.8 Cr: కరోనా చికిత్సకు 1.8 కోట్ల రూపాయల బిల్లు... మాక్స్ హాస్పిటల్ నిర్వాకం!

 

ప్రస్తుతం శ్రావణమాసం (Sravana Masam).. పెళ్లి పనులు ప్రారంభం నుండి బరాత్‌ అయ్యే వరకు ఎక్కడ చూసిన ఇదే పాట. తాజాగా ఒక 70 ఏళ్ల వయసున్న బామ్మ భర్త ముందు బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవగా... ఇంకేం ఉంది వైరల్ అయిపోయింది. యువతీ యువకులకు ఏ మాత్రం తీసిపోనంటూ.. ఆ వృద్దురాలు "డుగ్గు డుగ్గు" (Duggu Duggu) పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది.

ఆ వీడియోలో దాదాపు 70 ఏళ్ల వయసు గల బామ్మ.. మంచంపై కూర్చున్న భర్తకు ముందు... పాటకు తగ్గట్టు ఆమె బామ్మ డ్యాన్స్ చేసింది. ఆ బామ్మ అలా డ్యాన్స్ చేస్తుంటే భర్త మాత్రం ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు... "సూపర్ బామ్మ" అంటూ కామెంట్ పెడుతుంటే "నువ్వు గ్రేట్ బామ్మ" అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. 

Also Read: Taliban Beaten Afghan Journalists: ఆగని తాలిబన్ల అరాచకాలు..జర్నలిస్టులకు చిత్రహింసలు (వీడియో)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News