Odisha: డాక్టర్ ను క్యాబిన్ లో చెప్పుతో కొట్టిన మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
Viral news: మంగళవారం పర్లాకిమిడి జిల్లా హెడ్‌క్వార్టర్స్ హాస్పిటల్ (డిహెచ్‌హెచ్)లో ఒక మహిళ డాక్టర్ ను దూషిస్తు దాడికి పాల్పడింది. ఈ ఘటనపై ప్రస్తుతం స్థానికంగా తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు.
Woman Attacks On Doctor: సాధారణంగా డాక్టర్లను దేవుళ్లుగా భావిస్తారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. డాక్టర్ పునర్జన్మనిస్తాడని చెబుతుంటారు. అయితే.. చాలా చోట్ల డాక్టర్లు ఆస్పత్రికి వచ్చిన బాధితుల సమస్యలను పరిష్కరిస్తారు. ఎంత పెద్ద వ్యాధి ఉన్న కూడా మాటలతో వారికి ధైర్యం చెప్పి, ఆ తర్వాత చికిత్సతో వ్యాధిని నయం చేస్తారు.
ఇదిలా ఉండగా... మరికొందరు డాక్టర్లు మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. బాధితులతో అమర్యాదగా ప్రవర్తిస్తారు. అంతే కాకుండా.. తమ ఉద్యోగానికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తారు. అచ్చం ఇలాంటి సంఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
ఒడిశాలోని పర్లాకిమిడి జిల్లాలోని ఆస్పత్రిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పర్లాకిమిడిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న సౌదామిని రైతా అనే బాలిక ఫిబ్రవరి 22, 2023న హాస్టల్ క్యాంపస్‌లో ఉరివేసుకుని కనిపించింది. అయితే.. బాలిక చనిపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పాఠశాల అధికారులు బాలిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించగా, మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఎవరో పథకం ప్రకారం హత్య చేశారని ఆరోపించారు. ఇది అప్పట్లో మిస్టరీగా మారింది. ఈ క్రమంలో.. తొలుత పర్లాకిమిడి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తుపై కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కేసును క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు.
నిన్న (మంగళవారం) ఉదయం, మరణించిన బాలిక తల్లి సుగ్యాని DHH ఆస్పత్రికి చేరుకుంది. తన కుమార్తె మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్ రష్మీ రంజన్ మిశ్రాపై అతని ఛాంబర్‌లో దాడి చేసింది. బాలిక శరీరంపై కనిపించిన గుర్తులను అతను (డాక్టర్) ప్రస్తావించలేదని ఆరోపించింది. కావాలనే డాక్టర్ తమకు అన్యాయం చేశాడని బాలిక తల్లి సుగ్యాని కంటతడిపెట్టింది.
ఈ క్రమంలో డాక్టర్ మిశ్రా ను అతని అందరు చూస్తుండగానే చెప్పుతో కొట్టి, దూషించింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. బాలిక తల్లి చేస్తున్న ఆరోపణలపై కూడా విచారిస్తామని అదనపు వైద్యాధికారి ప్రదీప్ పాండా తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook