Gyanvapi Dispute: జ్ఞానవాపి మసీదు కేసులో సంచలనం.. హిందువులు పూజలు చేసుకోవచ్చని కోర్టు తీర్పు.. డిటెయిల్స్ ఇవే..

Uttar Pradesh: వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సీల్డ్ బేస్‌మెంట్‌లో హిందువులు పూజలు చేసేందుకు అనుమతిస్తు అలహబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారం రోజుల్లో దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కోర్టు ఆదేశించింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Jan 31, 2024, 04:35 PM IST
  • - జ్ఞానవాపి మసీదు కేసులో కీలక మలుపు..
    - హిందువులు పూజలు చేసుకొవచ్చన్న వారణాసి కోర్టు..
    - వారంలోగా ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశం..
 Gyanvapi Dispute: జ్ఞానవాపి మసీదు కేసులో సంచలనం.. హిందువులు పూజలు చేసుకోవచ్చని కోర్టు తీర్పు.. డిటెయిల్స్ ఇవే..

Hindus Allowed To Worship In Sealed Basement: దేశంలో వందల ఏళ్ల తర్వాత అయోధ్య రామమందిర నిర్మాణం కలసాకారమైంది. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహం ను ఏర్పాటు చేసుకుని, మత సామారస్యం పాటిస్తు అనేక మంది భవ్యరామమందిరం చేరుకుని దర్శనం చేసుకున్నారు. ఇప్పటికే వేలాదిగా భక్తులు అయోధ్య రాముడి దర్శనం కోసం పరితపిస్తున్నారు. ఎక్కడ చూసిన జై శ్రీరామ్ నినాదాలు మారుమోగిపోతున్నాయి.

ఈ శుభ సందర్బంలో హిందు భక్తులకు మరో గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకొవడానికి అనుమతిస్తు అలహబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.  అదే విధంగా జ్ఞానవాపి మసీదులోని వ్యాస్ కా టెఖానా లో కూడా హిందువులు పూజలు చేసుకొవచ్చని తెలిపింది. దీనిలో భాగంగా బారికెడ్లన్నింటిని తొలగించి, ఏడు రోజుల్లో దీనిక సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశించింది.

అదే విధంగా విశ్వనాథ్ ఆలయ పూజారులు వంశపారపర్యంగా ఉన్న అర్చకులు  ఇక్కడ కూడా ఉంటారని తెలిపింది. ఏడు రోజులలో పూజలు  ప్రారంభమవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.  ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశీలనలో హిందూ దేవుళ్ల విగ్రహాల శిధిలాలు దొరికాయని గతంలో పేర్కొన్నారు. మసీదు నిర్మాణంలో స్తంభాలతో సహా, ముందుగా ఉన్న నిర్మాణంలోని కొన్ని భాగాలు - ASI నివేదిక ద్వారా హిందూ రాజులు పాలించబడినట్లు కూడా వాదించబడింది.

గత నెలలో, అలహాబాద్ హైకోర్టు కీలకమైన తీర్పులో, ఆ స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సివిల్ దావాలను సవాలు చేసిన మసీదు కమిటీ అన్ని పిటిషన్లను తిరస్కరించింది. మొత్తం కేసు ఐకానిక్ కాశీ విశ్వనాథ్ ఆలయానికి ప్రక్కనే ఉన్న జ్ఞాన్వాపి మసీదుకు సంబంధించినది. వారణాసి కోర్టులో 1991లో ఒక కేసును కొనసాగించడాన్ని సవాలు చేస్తూ ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌కు చెందిన ఇద్దరితో సహా హైకోర్టు విచారించి, తిరస్కరించింది.

Read Also: High Court: ''దేవాలయాలు పిక్నిక్ స్పాట్ లు కావు..".. హిందూయేతరుల ప్రవేశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన మద్రాసు హైకోర్టు...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x