Woman daughter fall from safari jeep infront of rhinos in kazirang: సాధారణంగా అడవిలో క్రూర జంతువులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జాతీయ పార్కులకు,సఫారీలకు చాలా మంది క్రూర జంతువుల్ని దగ్గర నుంచి చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు ప్రత్యేకంగా సెఫ్టీలు ఉన్న జీప్ లలో టూరీస్టులను తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం  కొంత మంది టూరీస్టులు అతిగా ప్రవర్తిస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జంతువులు దగ్గరకు వెళ్లగానే గట్టిగా కేకలు వేయడం, అరవడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో అవి కొన్నిసార్లు టూరిస్టులపై దాడులు చేసిన ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. తాజాగా.. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో టూరిస్టులు కొందరు వెళ్లినట్లు తెలుస్తొంది.  ఈ క్రమంలో ఒక ఫ్యామిలీకీ షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 


అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో కొంత మంది టూరీస్టులు సఫారీలో జంతువుల్ని చూసేందుకు దగ్గర నుంచి వెళ్లారు . అక్కడ సఫారీ జీబ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు.. ఒక్కసారిగా అనుకొని ఘటన చోటు చేసుకుంది. ఎదురుగా భారీ  ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. అప్పుడు.. టూరీస్టు వెహికిల్ దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు.  


అప్పుడు అక్కడ రెండు వాహనాలు ఉన్నాయి.  ఒక్కసారిగా టర్నింగ్ దగ్గర వాహనం వెళ్తుండగా.. ఒక్కసారిగా వెహికిల్ కుదుపునకు లోనైనట్లు తెలుస్తొంది. దీంతో ఆ వెహికిల్ లోని తల్లి కూతురు ఒక్కసారిగా ఎగిరి కింద పడ్డారు. దీంతో అక్కడున్న వారంతా అరుపులు, కేకలు పెట్టారు. 


ఈలోపు.. ముందుకు వెళ్లిన జీపు నెమ్మదిగా వాళ్ల దగ్గరకు చేరుకుంది . ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ బిడ్డతో తల్లి వాహనం ఎక్కేసింది. దీంతో అక్కడున్న  ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు వీరిని చూసి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. వీళ్లు కనుక  ఆలస్యం చేసుంటే.. ఎలాంటి ఘటన జరిగేదో అంటూ అక్కడున్న వారంత షాక్ కు గురౌతున్నారంట.


Read more: Viral Video: వామ్మో.. శ్రీ శైలంలో పూజారీ ఇంటి ఆవరణలో చిరుత సంచారం.. వీడియో వైరల్..


అంతే కాకుండా..  ఒంటి కొమ్ము ఖడ్గమృగం నుంచి బైటపడేసిన ట్రక్ డ్రైవర్ కు థైంక్స్ చెబుతున్నారంట. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారంట. మరికొందరు మాత్రం.. వీళ్లకు టైమ్ బాగుందని కూడా కామెంట్లు చేస్తున్నారంట.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter