Leopard spotted in srisailam video viral: ఇటీవల శ్రీశైలంలో తరచుగా చిరుతపులులు రోడ్ల మీద కన్పిస్తున్నాయి. అర్దరాత్రి పూట చిరుతలు రోడ్డుమీదకు వచ్చిన ఘటనలు గతంలో అనేకం చోటుచేసుకున్నాయి. అంతే కాకుండా.. పలు మార్లు రాత్రి పూట చిరుతలురోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటనలు జరిగాయి. ఈ క్రమంలోఅధికారులు మాత్రం.. ముఖ్యంగా రాత్రిపూట ఎంతో జాగ్రత్తగా ఉండాలని కూడా భక్తులకు తరచుగా చెప్తుంటారు.
శ్రీశైలం పూజారి ఇంట్లో చిరుత పులి సంచారం.. సీసీటీవీ ఫుటేజ్
పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి సంచరించిన చిరుత పులి pic.twitter.com/3YjVJ6blkB
— Telugu Scribe (@TeluguScribe) January 6, 2025
ఈ నేపథ్యంలో ప్రస్తుతం చిరుతపులి ఒకటి శ్రీశైలంలోని పాతల గంగ మెట్ల మార్గంలోకి వచ్చినట్లు తెలుస్తొంది. అక్కడున్న పూజారీ.. సత్య నారాయణ ఇంట్లో రాత్రి పూట చిరుత సంచరించినట్లు సమాచారం. చిరుత ఆహార అన్వేషణలో భాగంగా గ్రామంలోకి వచ్చినట్లు తెలుస్తొంది. అయితే.. శ్రీశైలం చుట్టుపక్కల దట్టమైన అడవి ఉంటుంది. అక్కడి నుంచి తరచుగా చిరుతలు, ఇతర జంతువులు రోడ్ల మీదకు వస్తుంటాయి.
అదే విధంగా ప్రస్తుతం చిరుత ఏకంగా ఇంటి ఆవరణలో రావడంతో శ్రీశైలం స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం పూజారీ ఇంట్లో చిరుత పులి సంచరించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తొంది.
Read more: Viral Video: ఓయమ్మనే.. కమ్మని పిజ్జాలో బైటపడ్డ పదునైన కత్తిముక్క.. షాకింగ్ వీడియో వైరల్..
దీన్ని చూసిన జనాలు మాత్రం భయపడిపోతున్నారు. మరొవైపు శ్రీశైలం పోలీసులు,ఫారెస్ట్ సిబ్బంది మాత్రం ప్రజలు రాత్రి పూట జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు. మరోవైపు ప్రస్తుతం వరుస సెలవులు, సంక్రాంతి పండుగల నేపథ్యంలో శ్రీశైలంకు భక్తులు తాకిడి పెరిగినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter