Viral News: 23 ఏళ్లు కేవలం సాండ్‌విచ్‌లతోనే బతికేసింది... హిప్నటిజంతో ఆమె జీవితంలో ఊహించని మిరాకిల్
UK Girl Eats Only Sandwiches for 23 Years: ఎంత ఫేవరెట్ ఫుడ్ అయినా వరుసగా రెండు, మూడు రోజులు తింటే బోర్ కొట్టేస్తుంది. కానీ యూకెకి చెందిన ఓ యువతి 23 ఏళ్లు కేవలం సాండ్విచ్లే తిని బతికింది.
UK Girl Eats Only Sandwiches for 23 Years: యూకెకి చెందిన 25 ఏళ్ల జోస్ సాండ్లర్ అనే యువతి 23 ఏళ్ల పాటు కేవలం సాండ్‌విచ్‌లు తింటూ బతికేసింది. రెండేళ్ల వయసు నుంచి నిన్నా, మొన్నటివరకూ నిత్యం ఆమె బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... అంతా సాండ్‌విచ్‌మయమే. జోస్ ఇలా సాండ్‌విచ్‌లు మాత్రమే తినడానికి కారణం... మిగతా ఫుడ్ ఏదీ ఆమె శరీరానికి పడేది కాదు. సాండ్‌విచ్ కాకుండా ఏ ఫుడ్ తీసుకున్నా ఆమె అనారోగ్యానికి గురయ్యేది. అలాంటి జోస్ సాండ్లర్ జీవితంలో ఇటీవల మిరాకిల్ జరిగింది.
డేవిడ్ కిల్మరీ అనే హిప్నటిస్ట్ జోస్ సాండ్లర్ జీవితాన్నే మార్చేశాడు. కేవలం సాండ్‌విచ్ మాత్రమే తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత పోషకాలు అందక జోస్ మెదడు, నరాలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధుల బారినపడింది. దీంతో ఎలాగైనా సరే తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని జోస్ నిశ్చయించుకుంది. డేవిడ్ కిల్మరీ అనే హిప్నటిస్ట్ తన లాంటి ఎన్నో కేసులను సక్సెస్‌ఫుల్‌గా డీల్ చేశాడని తెలిసి అతన్ని సంప్రదించింది.
డేవిడ్ కిల్మరీ రెండు గంటల చొప్పున కొద్దిరోజుల పాటు సాండ్లర్‌ను హిప్నటైజ్ చేశాడు. అంతే... జోస్ సాండ్లర్ పూర్తిగా మారిపోయింది. కేవలం సాండ్‌విచ్‌లు మాత్రమే తీసుకున్న జోస్ సాండ్లర్ ఇప్పుడు అన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటోంది. 'నేను నమ్మలేకపోతున్నా ఇది... స్ట్రాబెరీస్ తిన్నాను ఎంత రుచిగా ఉన్నాయో... వగమమ చిల్లీ స్క్విడ్ కూడా ట్రై చేశాను... చాలా స్పైసీగా ఉంది. మున్ముందు కర్రీస్, ఇతర ఫుడ్స్‌ను ట్రై చేయాలనుకుంటున్నా...' అని జోస్ శాండ్లర్ చెప్పుకొచ్చింది.
హిప్నటిస్ట్ డేవిడ్ కిల్మరీ మాట్లాడుతూ... జోస్ సాండ్లర్ ఇన్నేళ్లు నియోఫోబియాతో బాధపడినట్లు పేర్కొన్నారు. ఆ కారణంగానే ఆమె సాండ్‌విచ్ తప్ప ఇతర ఆహార పదార్థాలు కనీసం రుచి చూసేందుకు కూడా ఇష్టపడలేదని తెలిపారు. తాను హిప్నటైజ్ చేసిన కొద్దిరోజులకే ఆమెలో మార్పు కనిపించిందన్నారు. ఇప్పుడు జోస్ బట్లర్ అన్ని రకాల ఫుడ్స్ ఆస్వాదిస్తోందని తెలిపారు.
Also Read: Gautam Gambhir Post: ఎలిమినేటర్‌లో ఓడిన లక్నో.. వైరల్‌గా మారిన గంభీర్ ఎమోషనల్ పోస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి