Gautam Gambhir Post: ఎలిమినేటర్‌లో ఓడిన లక్నో.. వైరల్‌గా మారిన గౌతమ్ గంభీర్ ఎమోషనల్ పోస్ట్!

IPL 2022 Eliminator LSG vs RCB, Gautam Gambhir emotional post. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఓడిన అనంతరం లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్ గౌతమ్ గంభీర్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 09:50 PM IST
  • పోరాడినా ఓటమి తప్పలేదు
  • ఎలిమినేటర్‌లో ఓడిన లక్నో
  • వైరల్‌గా మారిన గౌతమ్ గంభీర్ ఎమోషనల్ పోస్ట్
Gautam Gambhir Post: ఎలిమినేటర్‌లో ఓడిన లక్నో.. వైరల్‌గా మారిన గౌతమ్ గంభీర్ ఎమోషనల్ పోస్ట్!

IPL 2022 RCB v LSG Eliminator, Gautam Gambhir emotional post goes viral: ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం రాత్రి చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై లక్నో సూపర్‌ జెయింట్స్‌ 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రజత్‌ పాటీదార్‌ (112 నాటౌట్‌; 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ చేయగా.. దినేశ్‌ కార్తీక్‌ (37 నాటౌట్‌; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 208 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 6 వికెట్లకు 193 స్కోరుకే పరిమితం అయింది. కేఎల్ రాహుల్‌ (79; 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), దీపక్‌ హుడా (46; 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) పోరాడినా ఓటమి తప్పలేదు. 

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫీల్డింగ్ వైఫల్యమే రాహుల్ సేనను దెబ్బతీసింది. లక్నో ఆటగాళ్లు పదేపదే క్యాచులు వదిలేయడమే కాకుండా.. బౌండరీలను కూడా ఆపలేకపోయారు. ముఖ్యంగా నాలుగు క్యాచులు వదిలేసి భారీ మూల్యం చెల్లించుకుంది. మరోవైపు బ్యాటింగ్లోనూ తడబడింది. స్టార్ ప్లేయర్స్ క్వింటన్ డికాక్ (6), ఎవిన్ లూయిస్ (2), మనన్ వోహ్రా (19), మార్కస్ స్టొయినిస్ (9), కృనాల్ పాండ్యా (0) విఫలమయ్యారు. కేఎల్ రాహుల్‌ 79 రన్స్ చేసినా.. అందుకోసం 58 బంతులు తీసుకున్నాడు.

బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలను డగౌట్లో కూర్చుని చుసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పదేపదే అసహనానికి గురయ్యాడు. ఒక్కోసారి గట్టిగా అరుస్తూ ఆవేశానికి గురయ్యాడు. కొన్నిసార్లు తలపై చేతులు పెట్టుకుంటూ ఫ్రస్టేట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్లలో అయితే గౌతీ పడిన టెన్షన్ అతడి ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఇక మ్యాచ్ ఓడాక కేఎల్ రాహుల్‌ వైపు చూస్తూ నిరాశ వ్యక్తం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gautam Gambhir (@gautamgambhir55)

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఓడిన అనంతరం లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్ గౌతమ్ గంభీర్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. 'ఈరోజు హార్డ్ లక్ (నేడు అదృష్టం మాకు కలిసి రాలేదు). కొత్త జట్టు అయినా.. బాగా ఆడింది. ఇది మాకు గొప్ప టోర్నమెంట్. తర్వాతి సీజన్‌కు మరింత బలంగా తిరిగి వస్తాం. మళ్లీ కలుద్దాం' అని గంభీర్ ట్వీటాడు. ఈ పోస్టుకు గౌతీ తన ఫొటోను జతచేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. 

Also Read: Ruhani Sharma Pics: బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోసిన రుహానీ శ‌ర్మ‌.. ఇట్స్ వెరీ హాట్ గురూ!

Aslo Read: Rajat Patidar Marriage: ఐపీఎల్ 2022 కోసం.. పెళ్లి వద్దనుకున్న బెంగళూరు ఆటగాడు రజత్ పటీదార్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News