Snake viral video: కింగ్ కోబ్రా సర్పం ఎంతో డెంజర్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది కుట్టిన నిముషాల వ్యవధిలోనే మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని కూడా చెప్పవచ్చు. ఇదిలా ఉండగా.. కింగ్ కోబ్రాకు చెందిన వీడియోలు ఎక్కువగా సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారుతుంటాయి. చాలామంది పాములను ఇష్టమున్నట్లు పట్టుకుని వాటితో చెలగాటం ఆడుతుంటారు. మరికొందరు పాములు అక్కడ కన్పిస్తే.. ఇట్నుంచీ ఇటే పారిపోతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ కొందరు పాములను తాకుతూ, ముద్దులు పెట్టుకుంటూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కొన్నిసార్లు పాములను రెచ్చగొడుతూపైశాచీక ఆనందం కూడా పొందుతుంటారు. పాములకు చెందిన వీడియోలు ఎక్కువగా వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే పారిపోవాలనిపిస్తుంది. మరికొన్ని పాముల వీడియోలు చూస్తే బాబోయ్ అన్న విధంగాను ఉంటాయి. పాములు ఎక్కువగా చెట్లు, అడవులలలో ఉంటాయి.


 



ఇవి ఎలుకల్ని వేటాడి తింటుంటాయి. పొలాల్లో కూడా పాములు తిరుగుతు ఉంటాయి. కొన్నిసార్లు మనిషి కూడా పాముల కాటుకు గురౌతుంటారు. ఈ క్రమంలో ఒక మహిళ పాము ముందరు చేసిన పనిని ప్రస్తుతం నెటిజన్లు మాత్రం తిట్టిపొస్తున్నారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


ఇన్ స్టాలో ఒక యువతి.. లక్కీ_udaan4090లో ఒక వీడియోను షేర్ చేసింది. దీనిలో ఒక డ్యాన్సర్ ముందు నల్లగా నిగ నిగ లాడుతున్న కింగ్ కోబ్రా సర్పం ఉంది. అది కోపంతో ఉన్నట్లు తెలుస్తొంది. అయితే.. సదరు యువతి మాత్రం డ్యాన్స్ చేస్తునే పామును విసిగిస్తోంది. పామును తన నాలుకతో ముద్దులు పెట్టుకుంటూ..దాని దగ్గరకు వెళ్లి ఇరిటెట్ తెప్పిస్తుంది. పాము పలు మార్లు ఆ డ్యాన్సర్ ను కాటు వేసేందుకు కూడా ప్రయత్నించింది. అక్కడున్నవారు కూడా యువతి చేస్తున్న పనికి మండిపడుతున్నారు.


మరికొందరు మాత్రం వీడియోలు తీసుకుంటూ అక్కడ నుంచి దూరంగా చూస్తు ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం..ఇదేందిరా నాయన.. ఇయ్యే వద్దనేది.. అంటూ మండిపడుతున్నారు. మరికొందరు అది కాటేస్తే..అప్పుడు తెలుస్తది.. అంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.