Cobra snake viral video: పాము పేరు ఎత్తితేనే.. చిన్న నుంచి పెద్ద వాళ్ల వరకు అందరు భయంలో దూరంగా పారిపోతుంటారు. కండలు తిరిగిన మగాళ్లు సైతం.. పామును చూసి భయపడిపోతుంటారు. అడవులు, పంటపొలాలు ఉన్న చోట పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఎలుకల కోసం పాములు తరచుగా బైటకు వస్తుంటాయి.  కొన్ని సందర్భాలలో పాములు.. మన ఇళ్లలో, ఇంటి పరిసరాల్లోకి వస్తుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొందరు పాములు కన్పించగానే..వెంటనే స్నేక్ టీమ్ కు సమాచారం ఇస్తారు. మరికొందరు పాము మీద తమ ప్రతాపం చూపిస్తుంటారు. అయితే.. ఒక మహిళ వట్టిచేతులతో పామును బంధించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.


 



 వైరల్ గా మారిన వీడియోలో.. ఒక మహిళకు పాము వచ్చిందని అక్కడున్న వారు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తొంది.  బహుశా.. ఆమె పాముల్ని పట్టే మహిళ కావొచ్చు. కొందరు పాముల్ని పట్టడం, కాపాడటం కూడా హాబీగా పెట్టుకుని ఉంటారు. అయితే..ఈ మహిళ మాత్రం.. చీరలో వచ్చి.. వయ్యారాలు ఒలక పోస్తు.. ఏ మాత్రం భయపడకుండా.. పామును ఎంతో చాకచక్యంగా పట్టేసుకుంది.


Read more: Viral Video:ఇదెక్కడి విడ్డూరం.. చిరుతను అమాంతం లాక్కెళ్లిపోతున్న గద్ద.. షాకింగ్ వీడియో వైరల్..


అక్కడున్న వారు దూరంగా పారిపోతున్నఆమె నాగు పామును ఎంతో జాగ్రత్తంగా పట్టుకుని  ఒక ప్లాస్టిక్ బాటిల్ లో బంధించింది. ఆ తర్వాత పామును.. ఒక పొలంలోకి తీసుకెళ్లి వదిలేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం.. మహిళ దైర్యానికి ఫిదా అవుతున్నారు. మరికొందరు మాత్రం.. ఆ వయ్యారాలు కూడా భలే ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.