Mumbai Local Train Viral Video: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లోకల్ ట్రైన్‌లో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజు లక్షలాది మంది ఈ రైళ్లలో ప్రయాణం సాగిస్తుంటారు. చాలా మంది ప్రజలు తమ రోజువారీ కార్యకలపాలకు వెళ్లడానికి లోకల్ ట్రైన్‌పై ఆధారపడతారు. ఈ నేపథ్యంలోనే లోకల్ రైలు ఎక్కేందుకు వచ్చిన మహిళకు ట్రైన్‌లో స్పెస్ లేకపోవడంతో ఏకంగా లోకో పైలెట్ సీట్లో కూర్చొని వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ మహిళలో లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ముంబై స్టేషన్‌కు వచ్చింది. రైలు రాగానే రద్దీగా ఉన్నా ఆమె అలానే ఎక్కి డోర్ దక్కర నిల్చుంది. మెట్టుకు సమీపంలో చోటు లేకుండా వేలాడుతూ ఉంది. దీంతో రైలు ఆటోమేటిక్ డోర్లు మూసుకోలేదు. దీంతో రైల్వే గార్డులు మహిళను కిందకు దించి మరో రైలు ఎక్కమని కోరారు. తలుపులు మూసుకోకపోవడంతో రైలు కదలలేదు. దీంతో ప్రయాణికులు కూడా మహిళతో వాగ్వాదానికి దిగారు.


ఎవరు ఎన్ని చెప్పినా ఆమె మాత్రం అక్కడే నిలబడిపోయింది. దీంతో రైల్వే గార్డు మహిళను తీసుకెళ్లి లోకో పైలెట్ సీట్లో కూర్చొబెట్టాడు. ఆమె కూడా ఏ మాత్రం సంకోచిచకుండా వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చొని వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇప్పటివరకు ఈ వీడియోను 8 లక్షల మందిపైగా వీక్షించారు.


 





ఇటీవలె ముంబై లోకల్ ట్రైన్‌లో సీటు విషయంలో కొందరు మహిళల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. 'థానే-పన్వెల్' లేడీస్ కోచ్‌లో మహిళా ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. రైలు లోపల మహిళలు ఒకరి జుట్టు ఒకరు లాక్కొని కొట్టుకున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్‌ ప్రయాణికులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. 


Also Read: Ap Secretariat System: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త


Also Read: Anchor Suma : స్టాఫ్‌ను నెట్టి అవతల పారేసిన యాంకర్ సుమ.. వీడియో వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook