World Biggest Snake: ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. ఎందరో మనుషులను మింగేసింది! వీడియో చూస్తే వణికిపోవడం పక్కా
World’s Biggest Snake Reticulated Python Eaten Adult Humans: ప్రపంచంలోనే అతి పెద్ద పాము ఇప్పటివరకు అనకొండ అని చెబుతాం. కానీ అంతకంటే పెద్ద, పొడవైన పాము ఈ భూప్రపంచంలో ఉంది.
World Biggest Snake Viral Video, Adult Humans killing Reticulated Python Spotted: ఏదైనా జాతికి సంబంధించిన దానిని లెక్కించుకోవాలంటే.. పరిమాణం, బరువు, పొడవులను కొలమానంగా తీసుకుంటారు. ఉదాహరణకు పిల్లి కుటుంబం గురించి మాట్లాడితే.. పులి అతిపెద్దది అని చెబుతాం. పాచిడెర్మ్ విషయానికి వస్తే.. ఆఫ్రికన్ ఏనుగు అతిపెద్దదిగా పరిగణించబడుతుంది. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద పాము ఇప్పటివరకు అనకొండ అని చెబుతాం. కానీ అంతకంటే పెద్ద, పొడవైన పాము ఈ భూప్రపంచంలో ఉంది. అదే 'రెటిక్యులేటెడ్ పైథాన్'.
ప్రపంచంలోనే అతిపెద్ద, పొడవైన పాము రెటిక్యులేటెడ్ పైథాన్. అనకొండ పరిమాణం మరియు ఇతర లక్షణాల పరంగా అగ్ర పాములలో ఒకటిగా పరిగణించబడినప్పటికీ.. రెటిక్యులేటెడ్ పైథాన్ అంతకుమించి ఉంది. దక్షిణ మరియు ఆగ్నేయాసియాకు చెందిన పైథాన్ జాతికి చెందినది ఇది. ప్రపంచంలోనే అతి పొడవైన పాము ఇదే అట. చాలామంది మనుషులు కూడా రెటిక్యులేటెడ్ పైథాన్‌లచే చంపబడ్డారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ద్వారా ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది.
వికీపీడియా ప్రకారం... రెటిక్యులేటెడ్ పైథాన్ జాతి దక్షిణ మరియు ఆగ్నేయాసియాకు చెందినది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన పాము. ఇది అద్భుతంగా ఈత కొట్టగలదట. సముద్రంలో చాలా దూరం ప్రయాణించగలదని వివేదికలు చెపుతున్నాయి. చిన్న చిన్న ద్వీపాలను ఈజీగా చుట్టేస్తుందట. పెద్ద పెద్ద మనుషులు కూడా రెటిక్యులేటెడ్ పైథాన్‌లచే చంపబడ్డారని సమాచారం.
ప్రపంచంలోనే అతిపెద్ద పాముకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సైన్స్ గర్ల్ (Science girl) ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రెటిక్యులేటెడ్ పైథాన్ (మలయోపిథాన్ రెటిక్యులాటస్) అనే శీర్షికతో షేర్ చేయబడింది. ఈ వీడియోలో పాము ఓ గోడ నుంచి పాకుతూ ఇంట్లోకి చొరబడుతుంది. ఈ పాము చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
Also Read: Best Mileage Car 2023: స్విఫ్ట్ కంటే తక్కువ ధర.. ఈ కారు మైలేజీ, భద్రతలో సూపర్! 27 కిలోమీటర్ల మైలేజ్
Also Read: MS Dhoni Paints Chairs: పెయింటర్ అవతారం ఎత్తిన ఎంఎస్ ధోనీ.. వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి