CSK Captain MS Dhoni enjoys painting at Chepauk: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. మెగా టోర్నీకి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఆటగాళ్లలందరూ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో సాధన చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నెల కిందటే సీఎస్‌కే శిబిరంలో చేరి ప్రాక్టీస్ చేస్తున్నాడు. చెన్నై హోమ్ గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో ధోనీ ఆటను చూసేందుకు సీఎస్‌కే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం చెపాక్ స్టేడియాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు.
గత మూడేళ్లుగా చెపాక్ స్టేడియంలో మ్యాచులు జరగకపోవడంతో సీట్లు కొన్ని పాడయ్యాయి. చెపాక్ అధికారులు పాడైన సీట్లను తీసేసి కొత్త వాటిని అమర్చుతున్నారు. అంతేకాదు పాత వాటికి మెరుగులు దిద్దుతున్నారు. అయితే మైదానంలో సాధన చేస్తున్న ధోనీ.. కాసేపు ఆటకు విరామం ఇచ్చి పెయింటర్‌గా మారాడు. గ్యాస్ బ్లోయర్ సాయంతో స్టేడియంలోని పలు కుర్చీలకు కలర్ వేశాడు. ముందుగా పసుపు రంగు కుర్చీలకు, ఆపై నీలం రంగు కుర్చీలకు పెయింట్ వేశాడు. మహీ పెయింట్ వేస్తుండగా.. పక్కనే ఉన్న చెన్నై ప్లేయర్స్ తెగ ఎంజాయ్ చేశారు.
గ్యాస్ బ్లోయర్ సాయంతో కుర్చీలకు పెయింట్ వేసిన ఎంఎస్ ధోనీకి సంబంధించిన వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిందని. 'ఇది కచ్చితంగా ఎల్లోవే.. ఏప్రిల్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం' అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మార్చి 31న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2023 ఆరంభం కానుంది. ఇక ఈ సీజన్‌లో చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఏప్రిల్ 3న జరగనుంది. ఆ రోజు చెన్నై, లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
“𝑫𝒆𝒇𝒊𝒏𝒊𝒕𝒆𝒍𝒚 𝒍𝒐𝒐𝒌𝒊𝒏𝒈 𝒀𝒆𝒍𝒍𝒐𝒗𝒆”
Anbuden Awaiting for April 3🦁💛 pic.twitter.com/eKp2IzGHfm— Chennai Super Kings (@ChennaiIPL) March 27, 2023
ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2023లో ఫర్వాలేదనిపించాడు. 14 మ్యాచులు ఆడిన మహీ.. 123.40 స్ట్రైక్‌రేటు, 33.14 సగటుతో 232 పరుగులు చేశాడు. ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. రవీంద్ర జడేజాకు బాధ్యతలు అప్పగించాడు. అయితే జడ్డూ కెప్టెన్సీలో జట్టు వరుసగా ఓటములు చవిచూసింది. దీంతో సీజన్ మధ్యలో మళ్లీ ధోనీకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది చెన్నై యాజమాన్యం. అప్పటికే వరుస ఓటములను ఎదుర్కొన్న జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంతో ముగించింది.
Also Read: Nitish Rana KKR Captain: నితీశ్ రాణాను కేకేఆర్ కెప్టెన్‌గా నియమించడానికి 3 కారణాలు ఇవే!
Also Read: KKR Captain 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా భారత ఆటగాడు.. ఈ పేరును ఎవరూ ఊహించరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.