Yahoo India: ఇండియాలో సేవల్ని నిలిపివేసిన యాహూ ఇండియా
Yahoo India: ప్రముఖ వెబ్ సర్వీస్ ప్రొవైడర్ యాహూ కీలక ప్రకటన చేసింది. 20 ఏళ్లపాటు అందించిన న్యూస్ ఆపరేషన్స్‌ను నిలిపివేసినట్టు ప్రకటించింది. మిగిలిన సేవలు కొనసాగనున్నాయి.
Yahoo India: ప్రముఖ వెబ్ సర్వీస్ ప్రొవైడర్ యాహూ కీలక ప్రకటన చేసింది. 20 ఏళ్లపాటు అందించిన న్యూస్ ఆపరేషన్స్‌ను నిలిపివేసినట్టు ప్రకటించింది. మిగిలిన సేవలు కొనసాగనున్నాయి.
అంతర్జాతీయ వెబ్ సర్వీస్ ప్రొవైడర్ యాహూ ఇండియాలో(Yahoo India) న్యూస్ ఆపరేషన్స్‌ను నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేసింది. 20 ఏళ్లపాటు అందించిన సేవలకు స్వస్తి పలికింది. న్యూస్ ఆధారిత వెబ్‌సైట్ కార్యకలాపాల్ని ఆపివేసిన యాహూ సంస్థ..మెయిల్ సర్వీసుల్ని మాత్రం కొనసాగించనుంది. ఆగస్టు 26 నుంచి యాహూ ఇండియా ఎటువంటి కంటెంట్ పబ్లిష్ చేయదని..యాహూ ఎక్కౌంట్‌తో పాటు మెయిల్, సెర్చ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం ఉండదని యాహూ తెలిపింది. ఈ పరిణామంతో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, మేకర్స్‌కు సంబంధించిన కంటెంట్ నిలిచిపోనుంది. ఎఫ్‌డీఐ కొత్త నిబంధనలు(FDI New Rules), విదేశీ మీడియా కంపెనీలపై భారతదేశ నియంత్రమ చట్టాల ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యాహూ స్పష్టం చేసింది. డిజిటల్ మీడియా కంపెనీల్లో 26 శాతం వరకూ మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని, అది కూడా కేంద్ర ప్రభుత్వ(Central government)అనుమతులతోనే అనుమతించాల్సిన పరిస్థితి. కొత్త నిబంధనలు అక్టోబర్ నుంచి అమల్లో రానున్నాయి.
Also read: Porcupine vs Leopard: చిరుతపులిని ఒక ఆటాడుకున్న ముళ్లపంది.. వైరల్ ఫోటోస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook