Snake video goes viral: చాలా మందిపాముల్ని చూడగానే భయంతో పారిపోతుంటారు. పాముల పేర్లు ఎత్తేందుకు కూడా ధైర్యం చేయరు. కొండలు, అడవులు చెట్లు, జలపాతాలు ఉన్న చోట పాములు ఎక్కువగాఉంటాయి. పొలాల్లో కూడా పాములు కన్పిస్తుంటాయి. ఎలుకలు తినేందుకు పాములు మన ఇళ్లలోనికి వస్తుంటాయి. కొంత మంది పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీవాళ్లకు సమాచారం ఇస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మరికొందరు మాత్రం పాముల్ని కొట్టిచంపేందుకు సాహాసం కూడా చేస్తుంటారు. కానీ పాములను చంపితే కాలసర్పదోషం వస్తుంది. అందుకే పాములకు ఆపద కల్గించకూడదని చెప్తుంటారు. అదే విధంగా పాములకు చందిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. నెటిజన్ లు సైతం పాముల వీడియోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం ఒక పాము వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.


పూర్తి వివరాలు..


ఒక యువకుడు పొలంలో కూర్చుని తన లవర్ తో మాట్లాడుతూ మైమరచిపోయాడు. అతగాడు.. ఎంతలా ముచ్చట్లలో మునిగిపోయాడు. ఇంతలో భారీ సర్పం అతని కిందకు దూరింది. అయిన కూడా అతనిలో కదలిక లేదు. కాసేటికి ఏమో వెళ్లినట్లు అన్పించి వెంటనే లేచి చూశాడు. అప్పుడు భారీ సర్పం అతని కింద నుంచి మరోవైపుకు వెళ్లింది. వెంటనే బాబొయ్ అంటూ.. అక్కడి నుంచి ఫోన్ పారేసి పారిపోయాడు.


Read more: Video Viral: ఇంటి అల్మరాలో బుసలు కొడుతూ పైకి లేచిన 3 అడుగుల నాగుపాము.. కంగారులో ఇంటి ఓనర్‌ ఏం చేశాడంటే?


పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. బతికిపోయాన్ర బాబు.. అని  ఊపిరీ పీల్చుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. వీడి ఆయువు గట్టిదే అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. కాస్త చూసుకొని కూర్చో.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.