Youtube New Rules: యూట్యూబ్‌ను జీవనోపాధిగా చేసుకుని లక్షలు, కోట్లు సంపాదించేవాళ్లు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. కొత్తగా ఈ రంగంలో వచ్చేవారు ప్రారంభంలో కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. ఆ తరువాత అంతా క్రియేటివిటీపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ వేదిక కూడా నిబంధనల్లో సడలింపులు చేస్తూ కొత్తవారికి మార్గం సుగమం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ కొత్తవారికి శుభవార్త విన్పించింది. నిబంధనల్లో సడలింపులు చేసింది. యూట్యూబ్ ఛానెల్ కొత్తగా ప్రారంభించేవారు మోనిటైజేషన్ అర్హత సాధించేందుకు కావల్సిన సబ్‌స్క్రైబర్ల సంఖ్యను ఏకంగా సగానికి తగ్గించేసింది. అదే సమయంలో యూట్యూబ్ భాగస్వామ్య నిబంధనలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ కొత్తగా ప్రవేశపెట్టిన మోనిటైజేషన్ నిబంధనల ప్రకారం ఇకపై 500 మంది సబ్‌స్కైబర్లు ఉండాలి. చివరి 90 రోజుల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ వీడియోలు అప్‌లోడ్ చేసుండాలి. ఏడాదిలో 3000 నిమిషాల వ్యూస్ లేదా చివరి మూడు నెలల్లో 3 మిలియన్ల షార్ట్ వ్యూస్ ఉండాలి. ఈ అర్హతలు సాధిస్తే చాలు యూట్యూబ్ క్రియేటర్లకు మోనిటైజేషన్ అర్హత లభిస్తుంది. ఫలితంగా మీ వీడియోల్లో వాణిజ్య ప్రకటనలు వాటిపై ఆదాయం సమకూరుతుంది. 


ఇప్పటి వరకూ ఉన్న నిబంధనల ప్రకారం మోనిటైజేషన్ పొందాలంటే 1000 మంది సబ్‌స్క్రైబర్లు తప్పనిసరి. అదే సమయంలో ఏడాది వ్యవధిలో 4000 నిమిషాల వ్యూస్ లేదా 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్ వ్యూస్ ఉండాలి. అంటే కొత్త నిబంధనల ప్రకారం చాలావరకూ సడలింపులు వచ్చి చేరాయి. 4000 నిమిషాల నుంచి 3000 నిమిషాలకు తగ్గిపోయింది. సబ్‌స్కైబర్ల సంఖ్య 500కు తగ్గిపోయింది. 10 మిలియన్ల షార్ట్ వ్యూస్ నుంచి 3 వేల షార్ట్ వ్యూస్‌కు తగ్గించేసింది. క్రియేటివిటీ ఉండేవారికి నిజంగా ఇది చాలా మంచి అవకాశం. తక్కువ వ్యవధిలోనే యూట్యూబ్ ద్వారా ఆదాయం ప్రారంభించుకోవచ్చు.


అయితే ఈ కొత్త మోనిటైజేషన్ నిబంధనల్ని ముందుగా అమెరికా, బ్రిటన్ , కెనడా, తైవాన్, దక్షిణ కొరియా దేశాల్లో అమలు చేయనుంది. ఇండియాలో ఈ నిబంధనల్ని ఎప్పుడు అమలు చేసేది ఇంకా యూట్యూబ్ వెల్లడించలేదు. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే చిన్న చిన్న యూట్యూబర్ల కూడా డబ్బులు సంపాదించేందుకు వీలవుతుంది. 


Also read: Trending video: యువకుడిని అమాంతం మింగేసిన షార్క్... వైరల్ అవుతున్న వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook