Delhi Man Welcomes Zomato Agent with Aarti Ki Thali: ప్రస్తుత జనరేషన్‌లో దాదాపుగా అందరూ ఫుడ్‌ ఆర్డర్ పెట్టడానికే చుస్తున్నారు. బిజీబిజీ లైఫ్ కారణంగా ఇంట్లో వంట చేసే తీరిక లేక.. ఫుడ్‌ హోమ్‌ డెలివరీనే ప్రిఫర్‌ చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ సాయంతో ఒక్క క్లిక్‌తో నచ్చిన ఫుడ్ ఆర్డర్‌ పెట్టుకుంటున్నారు. ఇక పెట్టిన ఆర్డర్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కస్టమర్ ఎదురు చూస్తుంటాడు. మరోవైపు వర్షం, ఎండ, ట్రాఫిక్‌లను దాటుకుని సమయానికి ఫుడ్ డెలివరీ చేసేందుకు డెలివరీ బాయ్స్ నానా తిప్పలు పడుతుంటారు. అయినా కూడా ఒక్కోసారి డెలివరీ ఆలస్యం అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫుడ్ డెలివరీ కాస్త లేట్‌ అయితే చాలు కస్టమర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. డ్రైవింగ్ చేస్తున్న డెలివరీ ఏజెంట్‌కు కాల్ చేస్తూనే ఉంటారు.  లేదా ఆలస్యంగా వచ్చినందుకు వారిని తిడుతుంటారు. ఫుడ్ ఆలస్యం అయితే చాలా మంది ఇలానే వ్యవహరిస్తారు. అయితే తాజాగా ఓ కస్టమర్ అందరికంటే బిన్నంగా వ్యవహరించాడు. ఆలస్యంగా ఫుడ్‌ను తెచ్చిన డెలివరీ బాయ్‌కు వినూత్న రీతిలో స్వాగతం పలికాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


ఢిల్లీలో ఇటీవలి కాలంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓ కస్టమర్‌ జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకున్నాడు. ఓ వైపు వర్షం.. మరోవైపు పండుగ కావడంతో ఫుల్ ట్రాఫిక్‌ను దాటుకుని జొమాటో డెలివరీ బాయ్‌ ఎట్టకేలకు ఫుడ్‌ను డెలివరీ అందించాడు.  అయితే డెలివరీ గంట ఆలస్యం అయింది. 'సారీ సర్ అలస్యమైంది' అని ఆర్డర్‌ని అందజేయబోతే.. ఆయే ఆప్కా ఇంతేజార్ థా అని పాడుతూ డెలివరీ బాయ్‌కి కస్టమర్ స్వాగతం పలికారు. డెలివరీ బాయ్ చిరు నవ్వుతో తన హెల్మెట్ తీసి బొట్టు పెట్టించుకున్నాడు. కస్టమర్ ఆరతి ఇస్తుంటే.. అతడు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు.



డెలివరీ బాయ్‌కే సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో​ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'డెలివరీ బాయ్‌లు కూడా మనుషులే అని అర్థం చేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు', 'డెలివరీ చేసిన వ్యక్తి మీద కోపంతో విరుచుకుపడడం కంటే ఇది చాలా బెటర్' అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మీరు ఓసారి వీడియో చూసి ఎంజాయ్ చేయండి. 


Also Read: ఎంత నిర్లక్ష్యం.. నిలబడి డ్రైవింగ్ చేస్తున్న బస్సు డ్రైవర్! కేరళ రోడ్డు ప్రమాద డ్రైవర్ ఇతగాడే  


Also Read: Shetty 's Films in Kannada: కన్నడ నాట శెట్టిలదే హవా.. ఏడాదిలో మూడు సూపర్ హిట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook