Kerala tourist bus driver standing and dancing behind the wheel: రెండు రోజుల క్రితం కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పాలక్కాడ్ జిల్లా వడక్కెంచేరిలో పర్యాటకుల బస్సు, కేరళ ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 38 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు విద్యార్థులు, ఓ టీచర్ ఉన్నారు. టూరిస్ట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంతో ప్రమాద తీవ్రత తగ్గింది.
ఎర్నాకులంలోని మూలంతురుతిలోని బేసిలియస్ స్కూల్ 10,11,12 తరగతుల విద్యార్థులు టూరిస్టు బస్సులో విహార యాత్రకు వెళ్లారు. ఊటీకి వెళ్లి తిరిగి వస్తుండగా.. కారును ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో టూరిస్టు బస్సు ప్రమాదానికి గురై వాగులో బోల్తా పడింది. వలయార్ వడక్కంచేరి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వర్షం కురుస్తున్నా కూడా డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడు. దాంతోనే ఈ ప్రమాదం జరిగింది.
ప్రస్తుతం టూరిస్ట్ బస్సు డ్రైవర్‌కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులు ఊటీకి వెళుతుండగా డ్రైవర్ జొమోన్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడు. ఓవైపు వర్షం పడుతున్నా కూడా.. పాటలు వింటూ సీటులోంచి లేచి మరీ డ్రైవింగ్ చేశాడు. ఓ సమయంలో డాన్స్ కూడా చేశాడు. పక్కన ఉన్న అతను ఈ దృశ్యం చూస్తూ ఎంజాయ్ చేశాడు తప్ప.. అతడిని ఇలా చేయొద్దని వాదించలేదు. ఇక ప్రమాదం జరిగిన అనంతరం డ్రైవర్ జొమోన్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.
Also Read: కాటేయడానికి పరుగెత్తుకొచ్చిన 13 అడుగుల కింగ్ కోబ్రా.. ఈ వ్యక్తి ఎంత ఈజీగా హ్యాండిల్ చేశాడో చూడండి!
Also Read: ప్రపంచకప్‌లు వస్తుంటాయి పోతుంటాయి.. అతడు మరోసారి గాయపడితే కెరీర్‌కే ప్రమాదం: సల్మాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook