Zomato Boy Attacked Video:  ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్తున్న ఓ జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌పై ఓ మహిళ దాడికి పాల్పడింది. ఆవేశంతో ఊగిపోయిన ఆ మహిళ అతని నుంచి ఫుడ్ లాక్కుని చెప్పుతో కొట్టింది. రెండు, మూడుసార్లు 'షూ'తో అతనిపై దాడి చేసింది. అయితే అతనిపై ఆమె ఎందుకు దాడికి పాల్పడిందనేది తెలియలేదు. అటుగా వెళ్తున్న కొందరు దాడిని సెల్‌ఫోన్లలో చిత్రీకరించడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ దాడిపై ట్విట్టర్‌లో స్పందించిన ఓ నెటిజన్.. ఆ జొమాటో బాయ్‌ తనకు ఫుడ్ డెలివరీ చేసేందుకు వస్తుండగా దాడికి గురైనట్లు చెప్పాడు. తన ఆర్డర్ నంబర్ #4267443050గా పేర్కొన్నాడు. మార్గమధ్యలో ఓ మహిళ అతని నుంచి ఫుడ్ లాక్కుని చెప్పుతో దాడి చేసిందన్నారు. దీంతో ఆ ఫుడ్ డెలివరీ బాయ్‌ ఏడుస్తూ తన ఇంటికొచ్చినట్లు చెప్పాడు. దాంతో తాను జొమాటో కస్టమర్ కేర్‌కు కాల్ చేసినట్లు తెలిపాడు.


ఫుడ్ ఆర్డర్ గురించి తాను పట్టించుకోవట్లేదని.. కానీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌పై దాడి జరిగింది కాబట్టి అతనికి సాయం చేయాలని కస్టమర్ కేర్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పాడు. అయితే కంపెనీ రైడర్ సపోర్ట్ సర్వీస్‌ను సంప్రదించాలని కస్టమర్ కేర్‌ సిబ్బంది బదులిచ్చారని తెలిపాడు. వారు చెప్పినట్లుగానే అతను రైడర్ సపోర్ట్ సర్వీస్‌ను సంప్రదించినప్పటికీ.. అతను కన్నడలో చెప్పడంతో వారికేమీ అర్థం కాలేదన్నాడు. ఇకనైనా అతనికి న్యాయం జరిగేలా జొమాటో చర్యలు తీసుకోవాలని.. ఫుడ్ సెక్యూరిటీ కల్పించాలని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ గొడవ ఎందుకు జరిగింది.. అతనిపై ఆమె  'షూ'తో ఎందుకు దాడి చేసిందనేది తెలియలేదు. 




 


Also Read: Liger Twitter Review: ప్రేక్షకుల ముందుకొచ్చేసిన విజయ్ దేవరకొండ 'లైగర్'.. సినిమాపై ట్విట్టర్‌ రివ్యూ ఇదే..  


Also Read: Gold Price Today: పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలివే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook