ZPTC Dancing Inside Manthani Police  Station Video Goes Viral: సమాజంలో పోలీసులు అంటే ఒక మంచి గౌరవం, భయం ఉంటుంది. ఎంతో కష్టపడి చదివి పోలీసు ఉద్యోగంను సాధిస్తారు. పోలీసు ఉద్యోగం సాధించడమంటే అంతా ఈజీగా కాదు. దీనికి మూడు దశల్లో కష్టపడాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ ల ఎగ్జామ్ లలో కోసం ఎంత కష్టపడాల్సి ఉంటుంది. ఆయా ఎగ్జామ్ లలో ప్రతిభ కనబర్చిన తర్వాత చివరకు పోలీసు ఉద్యోగానికి కొందరు మాత్రమే సెలక్ట్ అవుతారు. ఇదిలా ఉండగా.. ఎంతో కష్టపడిన తర్వాత ఉద్యోగంలో చేరాక కొందరు మంచి పనితీరుతో అందరి మన్ననలను పొందుతారు. కానీ మరికొందరు మాత్రం.. పోలీసు శాఖకు చెడ్డుపేరు వచ్చేలా ప్రవర్తిస్తారు. కొందరు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మహిళలను వేధిస్తుంటారు. బాధితుల నుంచి ఎఫైఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేస్తుంటారు. సివిల్ తగాదాల్లో తలదూర్చి బాధితులను వేధిస్తుంటారు. మరికొందరు పోలీసు స్టేషన్ లలో చేయకూడని పనులు చేస్తుంటారు. కొందరు అధికార పార్టీల నేతలకు విధేయులుగా ప్రవర్తిస్తారు. అధికార పార్టీల నేతలు ఎలా చెబితే అలమసులుకుంటారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో  నిలిచింది.


మంథని జిల్లాలోని మహదేవపూర్ పోలీస్ట్ స్టేషన్ లో జరిగిన ఘటనర ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది. మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ జెడ్పిటీసి భర్త "మన్మధుడా" అంటూ చిందులు వేశాడు. అక్కడున్న సిబ్బంది సెల్ ఫోన్ లలో పాటలు పెట్టి  మరీ వీడియో రికార్డు చేశారు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. ఘటనపై ప్రజలు పోలీసులపై ఫైర్ అవుతున్నారు. 


Read More: Actress Sri Reddy: రాత్రంతా నిద్రలేదు.. గుక్కపెట్టి ఏడ్చిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..


మంథనిలో కొందరు పోలీసులు తమ ప్రతిష్టను దిగజార్చుకునేలా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు.  మంథనిలో కాంగ్రెస్ నాయకులు ఏది చెబితే అదే పనిని పోలీసులు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తు ఆరోపణలు వస్తున్నాయి.  ఇది పోలీస్ స్టేషనా లేక డ్యాన్స్ ఇన్స్టిట్యూటా అని  ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది. ఉన్నతాధికారులు దీనిపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter