Shani Nakshatra Gochar in May 2024:  మన చేసే పనులు మన కర్మలను నిర్ణయిస్తాయి. దీని ఆధారంగానే ఆశీర్వాదించాలా లేదా శిక్షించాలా అనేది శనిదేవుడు చూసుకుంటాడు. అందుకే ఇతడిని కర్మఫలదాత అని పిలుస్తారు. పంచాంగం ప్రకారం, శని గ్రహం మూడు దశాబ్దాల తర్వాత తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరుగుతున్నాడు. ఈ నెల 06న శని పూర్వాభాద్రపద నక్షత్రం యెుక్క మెుదటి స్థానంలోకి ప్రవేశించాడు. మే 12, ఉదయం 08:08 గంటలకు శనిదేవుడు ఇదే నక్షత్రం యెుక్క రెండో స్థానంలోకి వెళ్లబోతున్నాడు. అక్కడే ఆగస్టు 18 వరకు ఉంటాడు. శని యెుక్క ఈ నక్షత్ర మార్పు కారణంగా మూడు రాశులవారు కెరీర్ లో సక్సెస్, భారీ సంపదను పొందుతారు. ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశి
శని నక్షత్ర మార్పు ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారం మెుదలుపెట్టాలంటే ఇదే మంచి సమయం. కోరుకున్న జాబ్ దక్కుతుంది. భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. పెళ్లి కుదిరే అవకాశం ఉంది. పెట్టుబడులు మంచి రాబడులను ఇస్తాయి. అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. మీరు కెరీర్ లో మంచి పొజిషన్ కు వెళతారు. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు. 


మేషరాశి
శని నక్షత్రం మార్పు మేష రాశి వారికి ఎన్నడూ చూడని ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. మీ ఆస్తుపాస్తులు విపరీతంగా పెరుగుతాయి. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు ఇంతకముందు ఎప్పుడూ చూడని లాభాలను ఇస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ వద్దకు చేరుతుంది. 


కన్య రాశి 
కన్య రాశి వారికి శని నక్షత్ర మార్పు అద్భుతంగా ఉండబోతుంది. అసంపూర్ణంగా మిగిలిపోయిన పనులు పూర్తవుతాయి. మీ బిజినెస్ వృద్ధి చెందుతుంది. శ్రామికులు జీతాలు పెరుగుతాయి. ఆగిపోయిన ప్రమోషన్ దక్కుతుంది. మీరు గుడ్ న్యూస్ వింటారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. 


Also Read: Varuthini Ekadashi 2024: మే నెలలో ధనవంతులు కాబోతున్న రాశులు ఇవే.. మీది ఉందా?


Also Read: Guru Gochar 2024: గురు గోచారంతో ఈ రాశువారు తీవ్ర ఇబ్బందులు పడతారు.. మీ రాశి కూడా ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి