Varuthini Ekadashi 2024 effect on Zodiac Signs: హిందువులు ఏకాదశిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ ఏకాదశుల్లో కొన్నింటికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి వరూథిని ఏకాదశి. ఇది వచ్చే నెల 04వ తేదీన రాబోతుంది. పైగా వైశాఖ మాసంలో వస్తుంది కనుక దీనిని వైశాఖ కృష్ణ ఏకాదశి అని కూడా అంటారు. అంతేకాకుండా ఈ ఏకాదశి సమయంలోనే కొన్ని శుభకరమైన యోగాలు రూపుదిద్దుకుంటున్నాయి. అవే త్రిపుష్కర యోగం, ఇంద్రయోగం, వైధృతియోగం. దీంతో ఈ యోగాలు మరియు శ్రీహరి ఆశీస్సులు కారణంగా నాలుగు రాశులవారు ధనవంతులు కాబోతున్నారు. ఆ అదృష్ట జాతకులు ఎవరో తెలుసుకుందాం.
కన్య: వరూథిని ఏకాదశి కారణంగా కన్యా రాశికి చెందిన వ్యక్తులు ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ టైంలో పెట్టే పెట్టుబడులు ఎనలేని లాభాలను ఇస్తాయి. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
మకర రాశి: వైశాఖ ఏకాదశి మకరరాశి వారి జీవితాల్లో వెలుగులు నింపబోతుంది. మీ దాంపత్య జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. మీరు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటారు. మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు.
Also Read: Shasha Mahapurusha Raj Yoga: 2025 సంవత్సరంలో ఈ రాశులవారు కోట్లు గడించబోతున్నారు!
మేషం: వరూథిని ఏకాదశి నాడు సంభవించబోతున్న రాజయోగాలు మేషరాశి వారికి ఎన్నో బెనిఫిట్స్ ను అందించబోతున్నాయి. మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ ఆస్తి విపరీతంగా పెరుగుతుంది. మీ జీవితంలో ఆనందం తాండవిస్తోంది.
మిథునం: మే 4 తర్వాత మిథునరాశి వారి జీవితాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి. దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. మీరు చేసే వ్యాపారాలు భారీగా లాభాలను ఇస్తాయి. ఆఫీసులో మీరు కోరుకున్న పొజిషన్ కు వెళథారు.
Also Read: Shukra Gochar 2024: మే నెలలో ఈ 3 రాశులవారు జాక్ పాట్ కొట్టబోతున్నారు.. ఇందులో మీది ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి