Money will rain on These 3 Zodiac Signs after Buddha Purnima 2023: హిందూ గ్రంధాల ప్రకారం.. ప్రతి నెల చివరి తేదీ పూర్ణిమ తిథిగా పరిగణిస్తారు. ఇది హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా చెప్పబడింది. ఈ రోజున స్నానం చేయడం, దానం చేయడం లాంటి పనుల వల్ల మనిషికి శుభ ఫలితాలు కలుగుతాయి. వైశాఖ మాసంలో మే 5వ తేదీన పౌర్ణమి జరుపుకుంటారు. గౌతమ బుద్ధుడు వైశాఖ పూర్ణిమ రోజున జన్మించాడు. అందుకే ఈ రోజున 'బుద్ధ పూర్ణిమ' కూడా జరుపుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసారి బుద్ధి పూర్ణిమ రోజున చంద్ర గ్రహణం కూడా ఏర్పడుతుంది. 130 ఏళ్ల తర్వాత ఈ ప్రత్యేక యోగం రాబోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ యోగం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో కొందరు వ్యక్తులు డబ్బు, సంపద, కీర్తి మరియు అదృష్టంను పొందుతారు. ఈసారి బుద్ధ పూర్ణిమ ఏ రాశుల వారికి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందో తెలుసుకుందాం.


మేష రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈసారి బుద్ధ పూర్ణిమ నాడు మేష రాశిలో సూర్యుడు సంచరిస్తూ బుధ గ్రహంతో కలిసి ఉంటాడు. దీని కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది ఈ రాశి వ్యక్తులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మేష రాశుల వారికి సంపదలో పెరుగుదల ఉంటుంది. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా లాభాలు పొందవచ్చు. మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది. 


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు సూర్యుడు మరియు బుధుని కలయిక వలన కూడా అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో కర్కాటక రాశి వ్యక్తులు వ్యాపారంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. కెరీర్‌లో భారీ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అదృష్టం యొక్క మద్దతు మీకు లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే..మీరు కోరుకున్న ప్రదేశంలో బదిలీ పొందవచ్చు.


సింహ రాశి:
సూర్యుడు మరియు బుధుడు కలయికతో ఏర్పడిన బుధాదిత్య యోగం సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. జీవితంలో ఆనందం ఉంటుంది. ఈ సమయంలో జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు ఉంటుంది. వృత్తిలో విశేష అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు పొందవచ్చు. మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది. 


Also Read: IPL 2023 Points Table: పంజాబ్‌పై లక్నో భారీ విజయం.. మారిన పాయింట్ల పట్టిక! మీ ఫేవరేట్ టీమ్ ఏ ప్లేస్‌లో ఉందో తెలుసా  


Also Read: Highest IPL Team Scores: హిస్టరీ క్రియేట్ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌.. ఐపీఎల్‌లో రెండో జట్టుగా రికార్డు!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.