Lucknow Super Giants scores 2nd highest runs in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్ జెయింట్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు (ఒక ఇన్నింగ్స్‌లో) చేసిన రెండో జట్టుగా రికార్డు నెలకొల్పింది. శుక్రవారం మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఈ రికార్డు సాధించింది. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. 2013లో బెంగళూరు ఏకంగా పుణే వారియర్స్‌పై 263 రన్స్ చేసింది. బెంగళూరు రికార్డును బద్దలు కొట్టే అవకాశం లక్నో ముందున్నా.. చివరి ఓవర్లో భారీ షాట్లు ఆడలేకపోవడంతో తృటిలో మిస్ అయ్యారు.
ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్స్ చేసిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. గత 10 ఏళ్లుగా ఈ రికార్డును ఏ జట్టు బద్దలు కొట్టలేకపోయింది. రెండో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ (257/5) ఉండగా.. మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. 2016లో గుజరాత్ లయన్స్ జట్టుపై 248 రన్స్ చేసింది. నాలుగో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. 2010లో రాజస్థాన్ రాయల్స్ టీంపై 246 పరుగులు చేసింది. ఐదవ స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఉండగా.. 2018లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై 245 రన్స్ బాదింది.
ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్స్ లిస్ట్ (Highest Scores List in IPL History):
# రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 263/5- పూణే వారియర్స్ - 23 ఏప్రిల్ 2013
# లక్నో సూపర్ జెయింట్స్ - 257/5 - పంజాబ్ కింగ్స్ - 28 ఏప్రిల్ 2023
# రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 248/3 - గుజరాత్ లయన్స్ - 14 మే 2016
# చెన్నై సూపర్ కింగ్స్ - 246/5 - రాజస్థాన్ రాయల్స్ - 3 ఏప్రిల్ 2010
# కోల్‌కతా నైట్ రైడర్స్ - 245/6 - కింగ్స్ ఎలెవన్ పంజాబ్ - 12 మే 2018
గత రాత్రి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు చేసింది. మార్కస్ స్టాయినిస్ (72; 40 బంతుల్లో 6×4, 5×6), కైల్ మేయర్స్ (54; 24 బంతుల్లో 7×4, 4×6), నికోలస్ పూరన్ (45; 19 బంతుల్లో 7×4, 1×6), ఆయుష్ బదోని (43; 24 బంతుల్లో 3×4, 3×6) ఆకాశమే హద్దుగా చెలరేగారు. సిక్సర్లు, ఫోర్లు బాదడమే పనిగా పెట్టుకున్న లక్నో బ్యాటర్లు పదే పదే బంతిని బౌండరీ బాట పట్టించారు. దాంతో పంజాబ్ కింగ్స్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రాహుల్ చహర్ (29) మినహా బౌలర్లందరూ 12 కంటే ఎకానమీ నమోదు చేశారు. లక్నో ఇంకాస్త ప్రయత్నించి ఉంటే పదేళ్లుగా చెక్కుచెదరని ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డు కూడా బద్దలయ్యేదే.
భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. అథర్వ టైడ్ (66; 36 బంతుల్లో 8×4, 2×6) టాప్ స్కోరర్. శిఖర్ ధావన్ (1), ప్రభ్‌సిమ్రన్ సింగ్(9) విఫలమవగా.. సికందర్ రజా (36), లియామ్ లివింగ్‌స్టోన్ (23), సామ్ కరన్ (21), జితేశ్ శర్మ (24) రాణించారు. లక్నో బౌలర్లు యశ్ ఠాకూర్ (4/37), నవీనుల్ హక్ (3/30), రవి బిష్ణోయ్ (2/41) రాణించారు. 8 మ్యాచ్‌ల్లో లక్నో 5వ విజయం సాధించగా.. పంజాబ్ నాలుగో ఓటమి నమోదు చేసింది.
Also Read: Gold Price Today: మగువలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు! తులం బంగారం ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.