Mercury set 2023: యువరాజుగా పిలువబడే బుధుడు మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 27న శని యెుక్క రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. తర్వాత రోజే అదే రాశిలో మెర్క్యూరీ అస్తమించనున్నాడు. వచ్చే నెలలో బుధుడు కుంభరాశి నుండి బృహస్పతికి చెందిన మీన రాశిలోకి వెళ్తాడు. అనంతరం కుజుడు రాశి అయిన మీనరాశిలో ఎంటర్ అవుతాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం సూర్యుడు, శని గ్రహాలు కుంభరాశిలో ఉన్నారు. అదే రాశిలోకి బుధుడు ప్రవేశించినప్పుడు సూర్యుడు, మెర్క్యూరీ ఒకదానికొకటి దగ్గరగా ఉంటారు. సూర్యుని ప్రభావంతో బుధుడు అదృశ్యమవుతాడు. దీన్నే రెట్రోగ్రేడ్ ఆఫ్ మెర్క్యురీ అంటారు. మెర్క్యురీ దాదాపు ఒక నెల పాటు అస్తమిస్తాడు. బుధుడి కుంభరాశి ప్రవేశం వల్ల ఏయే రాశులవారికి లాభం కలుగుతుందో తెలుసుకుందాం. 


మేష రాశి
మేషరాశి వారికి బుధుడు కుంభ రాశి సంచారం కలిసి వస్తుంది. ఉద్యోగులు అనుకున్న పని జరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ప్రేమ లేదా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమంయలో మీరు బుధ గ్రహానికి సంబంధించిన పరిహారం చేయడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే శ్రీవిష్ణువు యొక్క వామనవతారాన్ని పూజించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. 
వృషభ రాశి 
బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల వృషభరాశి వారు లాభపడతారు. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. మీకు సీనియర్ల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అయితే ఒక నెల పాటు బుధగ్రహానికి పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీలైతే క్రమం తప్పకుండా ఆవుకు మేత తినిపించండి.
సింహ రాశి 
బుధుడి సంచారం సింహరాశికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. కొత్తగా బిజినెస్ పెట్టడానికి ఇదే మంచి సమయం. కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం  ఉంది. మానసికంగా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మాటలను అదుపులో ఉంచుకుంటే మంచిది. బుధవారం రోజు క్రమం తప్పకుండా శ్రీ గణపతి అథర్వశీర్ష పారాయణం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 
తులారాశి
మెర్క్యూరీ రాశి మార్పు తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు డబ్బు రాక మెుదలవుతుంది. మీ ప్రతిభను నిరూపించుకునే  అవకాశం లభిస్తుంది. విద్యార్థులకు సమయం చాలా బాగుంటుంది. వీలైతే బుధవారం నాడు అవసరమైన వారికి బట్టలు దానం చేయండి.


Also Read: Mangal Gochar 2023: మార్చిలో మిథునరాశిలోకి మార్స్.. ఈ రాశులకు కలిసిరానున్న కాలం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.