Mangal Gochar 2023: ఆస్ట్రాలజీలో గ్రహాల కమాండరైన అంగారుడిని రెడ్ ఫ్లానెట్ గా కూడా పిలుస్తారు. ధైర్యానికి కారకుడైన కుజుడి యెుక్క రాశిలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మార్చి 13, ఉదయం 4:30 గంటలకు కుజుడు వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడి రాశిలో మార్స్ ప్రవేశం వల్ల కొన్ని రాశులవారి లక్ కలిసి వస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
అంగారక సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేష రాశిచక్రం
మేష రాశి వారికి కుజుడు సంచారం శుభప్రదం కానుంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మీ వ్యాపారంలో భారీగా లాభాలను ఇస్తుంది. ఈసమయంలో పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. ఇతరులతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృషభ రాశి
అంగారకుడి సంచారం మీ జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది. దీని వల్ల మీ ఆగిపోయిన పని కూడా పూర్తవుతుది. వివాదాలు పరిష్కరించబడతాయి. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ఆద్యాత్మిక విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది.
కన్య రాశిచక్రం
కన్యా రాశి వారికి ఈ కాలంలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. మీరు వ్యాపారంలో ఊహించని స్థాయికి వెళతారు. మెుత్తానికి ఈసమయం మీకు అద్భుతంగా ఉండబోతుంది.
తుల రాశిచక్రం
కుజుడు రాశిమార్పు తుల రాశి ప్రజలను కూడా ప్రభావితం చేస్తుంది, మీరు పాత పెట్టుబడి నుండి ప్రయోజనం పొందవచ్చు. వ్యాపారంలో భారీగా లాభం ఉంటుంది. మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు మతపరమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అలాగే మీరు పాత స్నేహితులను కలుసుకునే అవకాశం కూడా ఉంది.
Also Read: Holi 2023: హోలీ నాడు ఈ 4 రాశులను వరించనున్న అదృష్టం.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.