Grah Gochar 2023: డిసెంబరులో కీలక గ్రహ సంచారాలు.. ఈ రాశుల వారు ధనవంతులవ్వడం ఖాయం..
Planet transit 2023: డిసెంబరులో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. దీని కారణంగా కొందరు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
2023 December Grah Gochar: గ్రహాల సంచారపరంగా డిసెంబరు నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో కొన్ని ప్రధాన గ్రహాలు తమ గమనాన్ని మార్చబోతున్నాయి. ఇందులో బుధుడు, సూర్యుడు, శుక్రుడు, అంగారకుడు మరియు గురుడు వంటి గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాల రాశి మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. డిసెంబరు నెలలో ఏయే గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయో, ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.
బుధుడి తిరోగమనం- గ్రహాల యువరాజైన బుధుడు డిసెంబరు 13, మధ్యాహ్నం 12.38 గంటలకు తిరోగమనం చేయబోతుంది. జనవరి 02 వరకు అదే స్థితిలో ఉంటుంది. బుధుడి యెుక్క ఈ రాశి మార్పు వల్ల వృషభం, మిథునం మరియు కుంభం రాశుల వారు ప్రయోజనం పొందనున్నారు.
సూర్యుడి సంచారం– గ్రహాల రాజు అయిన సూర్యుడు ఈ నెల 16, సాయంత్రం 04.09 గంటలకు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే ధను సంక్రాంతి అంటారు. ఈ సమయంలో నెల రోజులపాటు శుభకార్యాలు నిషేధించబడతాయి.
శుక్రుడి సంచారం - డిసెంబరు 25, ఉదయం 06.55 గంటలకు శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుని రాశిలో మార్పు కర్కాటకం, సింహం, మకరం మరియు కుంభరాశి వారికి ఉద్యోగ మరియు వ్యాపారాలలో మంచి పురోగతి సాధిస్తారు.
Also Read: Luckiest Zodiac Sign: 2024 సంవత్సరంలో 6 గ్రహాల తిరోగమనాలు..ఈ 3 రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే..
అంగారకుడి రాశి మార్పు- గ్రహాల కమాండరైన కుజుడు డిసెంబరు 28, ఉదయం 12.36 గంటలకు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలో సూర్యుడు, అంగారకుడు కలయిక ఏర్పడడం వల్ల మేష, కన్యా రాశి వారికి మేలు జరుగుతుంది.
బుధుడు సంచారం - ఈ నెల 28, ఉదయం 10.39 గంటలకు మెర్య్కూరీ వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడి సంచారం వల్ల వృషభం మరియు ధనుస్సు రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది.
గురుడు రాశి మార్పు- దేవగురు బృహస్పతి డిసెంబరు 31, ఉదయం 08.09 గంటలకు మేషరాశిలో నేరుగా నడవనున్నాడు. దీని కారణంగా మేషం, మిథునం, సింహం రాశుల వారి జీవితాల్లో వెలుగులు నింపనుంది.
Also Read: Horoscope 2024: 2024 సంవత్సరంలో లక్కీ రాశులవారు వీరే..మీ రాశి కూడా ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి