Horoscope 2024: 2024 సంవత్సరంలో లక్కీ రాశులవారు వీరే..మీ రాశి కూడా ఉందా?

Horoscope 2024: 2024 సంవత్సరంలో శని గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు శని భాద్రపద నక్షత్రంలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం రెట్టింపు లాభాలు కలుగుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2023, 07:31 PM IST
Horoscope 2024: 2024 సంవత్సరంలో లక్కీ రాశులవారు వీరే..మీ రాశి కూడా ఉందా?

Horoscope 2024: 2024 సంవత్సరం ప్రారంభంలో అనేక రకాల గ్రహాలు, నక్షత్రాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శని గ్రహం 2024 సంవత్సరలో ఏడాది పొడవునా కుంభరాశిలో ఉండబోతున్నాడు. అంతేకాకుండా శతభిషా నక్షత్రాన్ని వదిలి భాద్రపద నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. బృహస్పతి గ్రహం 30 ఏప్రిల్ మేషరాశిలో ఉండి, మే 1వ తేదిన  వృషభరాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో పాటు మీన రాశిలో రాహువు, కన్యారాశిలో కేతువు ఏడాది పొడవునా ఉండబోతున్నాయి. అయితే ఈ గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా లక్ష్మిదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి :
2024 సంవత్సరంలో మేష రాశి వారిపై శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు లభించబోతున్నాయి. ఈ సంవత్సరం జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసానికి ఎలాంటి లోటు ఉండదు. గత సంవత్సరంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ఆస్మికంగా ధన ప్రవాహం కూడా రెట్టింపు అవుతుంది. ఉద్యోగాలు చేసేవారికి మంచి లాభాలు కలుగుతాయి. దీంతో పాటు సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది. శనిదేవుని అనుగ్రహంతో పనుల్లో ఆటంకాలు తొలగిపోవడమే కాకుండా ఊహించని లాభాలు కలుగుతాయి. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. కెరీర్‌లో మంచి ప్రయోజనాలు పొందుతారు. వైవాహిక జీవితంలో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

వృశ్చికరాశి:
కొత్త సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంతోషం, అదృష్టం రెట్టింపు అవుతుంది. కెరీర్‌లో ప్రమోషన్‌ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడమే కాకుండా మంచి లాభాలు పొందుతారు. సంపదలో రెట్టింపు అయ్యి, వ్యాపారంలో పురోగతి కూడా లభిస్తుంది. వృశ్చిక రాశివారు పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్‌ లభించి ఆనందం రెట్టింపు అవుతుంది. దీంతో పాటు సంబంధాలలో కూడా ప్రేమ పెరుగుతుంది.

కుంభ రాశి :
2024 సంవత్సరంలో శనిదేవుడు అనుగ్రహం లభించి ఏడాది పొడవునా ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుంభ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో గొప్ప అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా సులభంగా మెరుగుపడతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News