Chandra Grahan 2023: మే 05న తొలి చంద్రగ్రహణం.. ఇది ఇండియాలో కనిపిస్తుందా?
Lunar eclipse 2023: మే 05న తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇప్పుడు ఏర్పడబోయేది పెనుంబ్రల్ చంద్రగ్రహణం. ఇది భారతదేశంలో కనిపిస్తుందా లేదో తెలుసుకుందాం.
Chandra Grahan 2023 date: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం వచ్చే నెల 05న సంభవించనుంది. అయితే రీసెంట్ గానే అంటే ఏప్రిల్ 20న సూర్యగ్రహణం ఏర్పడింది. ఇది జరిగిన 15 రోజులకే చంద్రగ్రహణం రూపొందనుంది. పక్షం రోజుల వ్యవధిలోనే రెండు గ్రహాణాలు ఏర్పడటం మెుత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. సూర్యగ్రహణం వలె చంద్రగ్రహణం కూడా ఖగోళ సంఘటన. సూర్యుడు మరియు చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం మే 5, శుక్రవారం రాత్రి 8:46 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1:20 గంటలకు ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణాన్ని పెనుంబ్రల్ ఎక్లిప్స్ అని పిలుస్తారు.
ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ చంద్రగ్రహణం యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, పసిఫిక్ అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది. చంద్రగ్రహణం యొక్క సూతక్ కాలం గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. గ్రహణం ముగియడంతో ఈ సూతక కాలం ముగుస్తుంది. ఈ పెనుంబ్రల్ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతక్ కాలం కూడా చెల్లదు. సూతక్ కాలంలో ఎటువంటి శుభ కార్యాలు జరగవు. ముఖ్యంగా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రావడం మంచిది కాదు.
Also read: Gajlaxmi Rajyog effect: మేషరాశిలో గజలక్ష్మీ రాజయోగం.. ఈ రాశులకు పట్టనున్న అదృష్టం..
Also read: Grah yuti 2023: ఒకే రాశిలో నాలుగు పెద్ద గ్రహాలు... ఈ 4 రాశులకు డబ్బే డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook