Surya grahan 2023: ఏప్రిల్ 20న మెుదటి సూర్యగ్రహణం... ఈ రాశులకు గడ్డు కాలం..
Surya grahan 2023: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుంది, దాని ప్రభావం రాశులపై ఎలా ఉంటుంది, అసలు ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే విషయాలు తెలుసుకుందాం.
Surya grahan 2023: ఈ ఏడాది రెండు సూర్యగ్రహణాలు సంభవించనున్నాయి. వాటిలో మొదటి గ్రహణం గురువారం, 02 ఏప్రిల్ 2023న ఏర్పడుతుంది. భూమికి మరియు సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడే ఖగోళ దృగ్విషయాన్ని సూర్యగ్రహణం అంటారు.
సూర్యగ్రహణం ఎప్పుడు?
2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 20 ఏప్రిల్ 2023 గురువారం నాడు ఏర్పడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ గ్రహణం ఉదయం 7.4 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 వరకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతక్ కాలం కూడ చెల్లదు. ఇప్పుడు ఏర్పడబోయే సూర్యగ్రహణం మేషరాశిలో ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇది మేషం, కర్కాటకం, తుల మరియు మకరరాశి వారిని ప్రభావితం చేస్తుంది. ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం అక్టోబరు 14న ఏర్పడనుంది. భారత్‌తో పాటు పశ్చిమాఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాదిలో ఈ గ్రహణం కనిపిస్తుంది.
ఈ రాశులపై ప్రతికూల ప్రభావం
సాధారణంగా సూర్యగ్రహణం ప్రభావం 12 రాశుల మీద ఉంటుంది. ఇది కొందరిపై మంచిగా, మరికొందరిపై చెడుగా ఉంటుంది. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. దీంతో మేషరాశి వారి కెరీర్ గందరగోళానికి గురవుతుంది. సింహ రాశి వారిపై కూడా సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావం చూపనుంది. విద్యా, ఉద్యోగ రంగాలలో అనేక సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. కన్యా రాశి వారు మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమయంలో మీ మాటలను అదుపులో ఉంచుకోండి.
Also Read: Surya Budh Guru Yuti 2023: ఒకే రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ మూడు రాశులకు తిరుగులేదు ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook