Surya Grahanam 2023: `సూర్యగ్రహణం`తో మారనున్న ఈ రాశుల తలరాత.. ఇందులో మీరున్నారా?
Solar eclipse 2023: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ లో ఏర్పడబోతుంది. ఈ గ్రహణ ప్రభావం రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Surya Grahanam date: 2023లో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఉదయం 7.04 నుంచి మధ్యాహ్నం 12.29 గంటల వరకు ఏర్పడనుంది. సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. ఈ గ్రహణం కంబోడియా, చైనా, అమెరికా, సింగపూర్, థాయిలాండ్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, వియత్నాం, తైవాన్, పాపువా న్యూ గినియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ హిందూ మహాసముద్రం మరియు న్యూజిలాండ్‌లలో కనిపిస్తుంది.
ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకే దాని సూతక్ కాలం కూడా మన దేశంలో చెల్లదు. ఈ గ్రహణం గురువారం ఏర్పడనుంది. ఇది మేషం మరియు అశ్వినీ నక్షత్రాలలో సంభవిస్తుంది. మేషరాశి సూర్యుని శ్రేష్ఠమైన రాశి మరియు అశ్విని కేతువు యొక్క నక్షత్రం. కాబట్టి ఈ గ్రహణం యొక్క ప్రభావం కొన్ని రాశుల వారికి శుభప్రదం కానుంది.
సూర్య గ్రహణం ఈ రాశులకు శుభప్రదం
మిథునరాశి- సూర్యగ్రహణం ఈరాశివారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. బిజినెస్ విస్తరిస్తుంది. ఉద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
ధనుస్సు రాశి- మీరు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. జీవితంలో సంతోషం నెలికొంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
వృషభం- ఈ రాశి వారికి సూర్యగ్రహణం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగుల శాలరీ పెరుగుతుంది. అంతేకాకుండా వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారులకు కూడా ఈ సమయం బాగుంటుంది.
Also Read: Astrology: ఇవాళ రాత్రికి మారనున్న ఈ రాశుల అదృష్టం.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook