March Horoscope 2023: మార్చి నెల మెుదలైంది. ఈ మంత్ లో కొన్ని ముఖ్యమైన గ్రహా సంచారాలు ఉన్నాయి. ఈ నెలలో సూర్యుడు, శుక్రుడు, బుధుడు మరియు కుజుడు తమ రాశులను మార్చనున్నారు. ఈ నెలలో శనిదేవుడు ఉదయించి.. దేవగురు బృహస్పతి అస్తమిస్తాడు. గ్రహాల యొక్క ఈ కదలిక ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. ఈ ఫ్లానెట్స్ గమనంలో మార్పు కారణంగా ముఖ్యంగా నాలుగు రాశులవారిపై లక్ష్మీదేవి కనకవర్షం కురిపించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి నెల ఈ రాశులకు శుభప్రదం
వృషభం
వృషభ రాశి వారికి ఈ మాసం అద్భుతంగా ఉండబోతుంది. మార్చి 15 నుండి వీరి కెరీర్ దూసుకుపోతుంది. ఈరాశివారి ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమ ఉంటుంది. ఈరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మిధునరాశి
మార్చిలో గ్రహాల సంచార ప్రభావం మిథున రాశి వారి జీవితంపై స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. బృహస్పతి గ్రహం మిమ్మల్ని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. వివిధ మార్గాల ద్వారా మీకు డబ్బు వస్తుంది. 
కన్య రాశి 
కన్యారాశి వారికి మార్చి నెల అనుకూలంగా ఉండబోతుంది. మీరు కెరీర్‌లో విజయాన్ని సాధిస్తారు. ఉన్న ఉద్యోగం కంటే మంచి జాబ్ వస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతం కానుంది. 
ధనుస్సు రాశి
మార్చిలో గ్రహాల సంచారం కారణంగా ధనుస్సు రాశి వారి కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. వ్యాపారులు లాభపడతారు. మీ కాపురంలో ప్రేమ పెరుగుతుంది. ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. 


Also Read: Surya Gochar 2023: ఈ నెల 15న మీన సంక్రాంతి.. ఈ 3 రాశుల జీవితాల్లో కాంతి.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.