Mercury Transit in Mithun Rashi on 24th June 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. గ్రహాల యువరాజైన బుధుడు ఈ నెల మెుదట్లో తన రాశిని మార్చి వృషభరాశిలోకి ప్రవేశించాడు. మళ్లీ జూన్ 24న మెర్క్యూరీ వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి వెళ్లనున్నాడు. బుధుడి యెుక్క గమనంలో మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. మిథునరాశిలో బుధుడి సంచారం వల్ల మూడు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి సాధించనున్నారు. బుధుడి సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడి సంచారం ఈ 3 రాశులకు శుభప్రదం


కుంభం:


మెర్క్యూరీ సంచారం కుంభరాశి వారికి మంచి ప్రయోజనాలను ఇవ్వనుంది. మీరు భారీగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు కోరుకున్న ఉద్యోగం వస్తుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


మేషం:


మిథునరాశిలో బుధుడి ప్రవేసం వల్ల మేషరాశి వారి మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 


Also Read: Shani Retrograde 2023: రాబోయే 140 రోజులపాటు ఈ 5 రాశులకు డబ్బే డబ్బు... మీరున్నారా?


కన్య:


బుధుడి రాశి మార్పు కన్యారాశివారికి మేలు చేయనుంది. మెర్క్యూరీ సంచారం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. మీరు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. మీ బిజినెస్ పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి సమయం గడుపుతారు. మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 


Also Read: Shukra gochar 2023: జూలై 07న శుక్రుడి గమనంలో పెను మార్పు... ఈ 3 రాశులకు ఊహించనంత డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి