Shani Vakri 2023: కుంభరాశిలో శని తిరోగమనం.. రాబోయే 140 రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు!

Shani Retrograde 2023 Effect: జూన్ 17న శనిదేవుడు వ్యతిరేక దిశలో నడవడం మెుదలుపెట్టాడు. శని యెుక్క ఈ తిరోగమనం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2023, 06:18 PM IST
Shani Vakri 2023: కుంభరాశిలో శని తిరోగమనం.. రాబోయే 140 రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు!

Shani Retrograde 2023 Effect: జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. నిన్న రాత్రి శని గ్రహం కుంభరాశిలో తిరోగమనం చేశాడు. నవంబరు 04 వరకు ఇదే స్థితిలో ఉండనున్నాడు. శని వ్యతిరేక కదలిక నుండి నేరుగా నడిచే వరకు ఈ 140 రోజులు అన్ని రాశులపై శుభ మరియు అశుభ ప్రభావాలను చూపుతాయి. అయితే శని తిరోగమనం ఈ 5 రాశులవారికి శుభఫలితాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.

శని తిరోగమనం ఈ రాశులకు వరం
కన్య:

శని రివర్స్ కదలిక కన్యా రాశి వారికి వ్యాపార-ఉద్యోగాలలో చాలా లాభాలను ఇస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ధనం పెరుగుతుంది. మీరు రుణం తీసుకునే అవకాశం ఉంది. 

ధనుస్సు:

శని తిరోగమనం ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీ దైర్య సాహసాలు పెరుగుతాయి. మీ పని అనుకున్న సమయానికి జరుగుతుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. 

మేషం:

తిరోగమన శని మేషరాశి వారిపై శుభ ప్రభావం చూపుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని పొందవచ్చు. మీ సర్కిల్ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి.

Also Read: Planet Vakri 2023: ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. రాబోయే 6 నెలలు వీరికి నరకమే..!

వృషభం:

వృషభ రాశి వారికి శని తిరోగమనం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. 

మిథునం:

శని వ్యతిరేక కదలిక వల్ల మీకు పెద్ద ప్యాకేజీతో జాబ్ వచ్చే అవకాశం ఉంది. విదేశాల్లో చదవాలన్న మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగ మరియు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. 

Also Read: Surya Gochar 2023: సంవత్సరం తర్వాత ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం... మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News