Mercury Transit 2023: అరుదైన యోగం చేస్తున్న బుధుడు.. ఉగాది నుంచి ఈ 3 రాశులకు అన్నీ శుభాలే..
Budh Gochar 2023: గ్రహాల యువరాజైన బుధుడు నీచభంగ్ రాజయోగం చేశాడు. దీంతో మూడు రాశులవారు బంపర్ ప్రయోజనాలను పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar 2023: ఫ్లానెట్స్ ప్రిన్స్ అయిన బుధుడు రీసెంట్ గా అంటే మార్చి 16 నాడు మీనరాశిలో సంచరించనున్నాడు. బుద్ది, వ్యాపారానికి మెర్య్కూరీని కారకుడిగా భావిస్తారు. బుధుడి రాశి మార్పు కారణంగా నీచభంగ్ రాజయోగం ఏర్పడింది. మెర్క్యురీ ట్రాన్సిట్ అన్ని రాశిచక్రాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. నీచభంగ్ రాజయోగం వల్ల ప్రయోజనం పొందే మూడు రాశులేంటో తెలుసుకుందాం.
నీచభంగ్ రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
వృషభం (Taurus): బుధ సంచారం వల్ల ఏర్పడిన నీచభంగ్ రాజయోగం యొక్క శుభ ప్రభావం వృషభ రాశి వారిపై శుభ ప్రభావం చూపుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
మిథునం (Gemini): నీచభంగ్ రాజయోగం మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
కన్యా రాశి (Virgo): కన్యా రాశి వారికి నీచభంగ్ మరియు హన్స్ రాజయోగం వల్ల ప్రయోజనం పొందుతారు. దీని కారణంగా రెట్టింపు లాభం ఉంటుంది. ఆదాయం పెరగడంతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. సాహిత్య రంగంతో సంబంధం ఉన్నవారు మంచి బెనిఫిట్స్ పొందుతారు.
Also Read: Ugadi Wishes 2023: ఈ కోట్స్ తో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి..
Also Read: Tata CNG 2023: బైక్ ధరలోనే టాటా సీఎన్‌జీ కారు.. ఏకంగా 26 కిలోమీటర్ల మైలేజ్! స్టైలిష్ లుక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook