Ugadi Wishes in Telugu 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, నూతన సంవత్సరాది అయిన ఉగాది లేదా యుగాదిని చైత్రమాసం శుక్లపక్షంలోని పాడ్యమి తిథినాడు జరుపుకుంటారు. ఈ పండుగను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు గోవాలలో జరుపుకుంటారు. ఈ పండుగను మరాఠీలు 'గుడిపడ్వా'గా, మలయాళీలు 'విషు' అనే పేరుతో, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున పంచాంగ శ్రవణం చేయండ, ముగ్గులు వేయడం, పచ్చడి తయారు చేసి అందరికీ పంచిపెట్టడం చేస్తారు. ఈ పచ్చడిని వేప పువ్వు, బెల్లం, కొబ్బరి కోరు, అరటి పండ్లు, మామిడి కాయ, ఉప్పు, శనగలు, చింతపండు మెుదలైన వాటితో చేస్తారు. అంతేకాకుండా ఈరోజున మిత్ర దర్శనమం ఆర్యపూజనం, గోపూజ, ఏరువాక అనే ఆచారాలను కూడా పాటిస్తారు. ఈ పండుగను పురస్కరించుకుని మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో ఉగాది శుభాకాంక్షలు తెలపండి.
ఉగాది 2023 శుభాకాంక్షలు
** అందరికీ జీ తెలుగు న్యూస్ తరుపున శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
** ఈ ఉగాది మీకు ఐశ్వర్యం, ఆనందం, మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుతూ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
** ఈ ఉగాది పండుగ మీ జీవితంలో వెలుగులు తీసుకురావాలని ఆశిస్తూ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు!
** ఈ తెలుగు సంవత్సరాది మీకు అదృష్టాన్ని ఇవ్వడంతోపాటు మీకు ప్రతి పనిలోనూ విజయాన్ని అందించాలి.
** ఈ కొత్త సంవత్సరం నుండి మీరు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ మీ కెరీర్ లో ముందుకు సాగాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
** ఈ ఉగాది మీ ఇంట ఆనందోత్సహాలు పూయిస్తుందని కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
** ఈ కొత్త ఏడాదిలో మీ కలలన్నీ నిజమవ్వాలని కోరుతూ ఉగాది శుభాకాంక్షలు.
** ఉగాది పచ్చడి లాగే మీ జీవితం కూడా షడ్రుచుల సమ్మేళనంగా ఉండాలని ఆశిస్తూ.. ఉగాది విషెస్ తెలియజేస్తున్నాం.
** మీ లైఫ్ లో అలుముకున్న చీకట్లు తొలగిపోయి.. వెలుగులు రావాలని కోరుతూ మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు.
** గతం తాలుకూ చేదు జ్ఞాపకాలను విడిచిపెట్టి...సరికొత్త ఆశలతో జీవితాన్ని ఆరంభించాలని కోరుతూ ఉగాది శుభాకాంక్షలు.
** ఈ ఉగాది మీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
Also Read: Ugadi 2023 Horoscope: శోభకృత్ నామ సంవత్సరంలో ఏయే రాశులకు ఎలా ఉంటుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook